AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prasad Thota: తెలుగు టెక్నీషియన్లకు అక్కడ మంచి గౌరవం ఉంటుంది: రచయిత తోట ప్రసాద్

తోట ప్రసాద్ స్టోరీ, డైలాగ్ రైటర్ల పాత్రల మధ్య వ్యత్యాసం, కథా రచన ప్రక్రియ గురించి వివరించారు. తెలుగు, తమిళ రచయితల పనితీరు, ప్యాషన్, సహకారం లేకపోవడం వంటి అంశాలను విశ్లేషించారు. అల్లు అర్జున్, సురేష్ బాబు వంటి ప్రముఖులు కథలు వినడం వల్ల పరిశ్రమకు లాభమని నొక్కి చెప్పారు. కథలే హీరోలను వెతుక్కుంటూ రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Prasad Thota: తెలుగు టెక్నీషియన్లకు అక్కడ మంచి గౌరవం ఉంటుంది: రచయిత తోట ప్రసాద్
Thota Prasad
Rajeev Rayala
|

Updated on: Sep 11, 2026 | 9:59 PM

Share

ప్రముఖ రచయిత తోట ప్రసాద్ స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్ల బాధ్యతలు, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని రచయితల పనితీరు, ప్యాషన్, సహకారం వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక స్టోరీ రైటర్ డైలాగ్ రైటర్‌గా మారగలరని ఆయన నొక్కి చెప్పారు. ఎందుకంటే కథలోని ముఖ్యమైన సంభాషణలు సన్నివేశాల నుంచే సహజంగా పుడతాయని ఆయన అన్నారు. కానీ కేవలం డైలాగ్స్‌పైనే దృష్టి సారించి, కథపై అవగాహన లేని డైలాగ్ రైటర్ స్టోరీ రైటర్‌గా ఎదగడం కష్టమని తెలిపారు. గతంలో పంచ్ డైలాగులకు ప్రాధాన్యం ఉండేదని, ఇప్పుడు ప్రేక్షకులు కథ నుంచి పుట్టే సహజమైన సంభాషణలను ఇష్టపడుతున్నారని ప్రసాద్ వివరించారు. తాను ప్రాథమికంగా స్క్రీన్ ప్లే రైటర్‌ని అని, స్టోరీ ఐడియాలను అభివృద్ధి చేస్తానని తోట ప్రసాద్ తెలిపారు. తన వద్ద కనీసం 10-15 కథలు సిద్ధంగా ఉన్నాయని, వాటిలో కొన్ని ఇప్పటికే రానా వంటి ప్రముఖులతో ఒకే అయ్యాయని వెల్లడించారు.

ఆ హీరోయిన్‌ను చూస్తే ఎవ్వరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది.. చాలా మంచింది : గుణశేఖర్

కథను బాగా చెప్పగలగడం కూడా ఒక కళ అని, హాలీవుడ్‌లో స్క్రిప్ట్ చదివి నిర్ణయాలు తీసుకుంటారని, కానీ తెలుగులో కథను చెప్పడం ముఖ్యమని తోట ప్రసాద్ వివరించారు. పూరీ జగన్నాథ్ వంటి దర్శకుల కోసం తాను కథలు చెప్పిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. అల్లు అర్జున్‌కు ఒక మెసేజ్‌తో బయోపిక్ ఐడియాను పంపినప్పుడు, ఆయన ఎంతగానో ఆకట్టుకున్నారని తెలిపారు. అల్లు అర్జున్ అనేక కథలు వినడాన్ని ప్రసాద్ ప్రశంసించారు. హీరోలు కథలను వెతుక్కుంటూ వెళ్లకూడదని, కథలే హీరోలను వెతుక్కుంటూ రావాలని అన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ , దిల్ రాజు వంటి నిర్మాతలు కథలను వినడంలో, వాటిని విశ్లేషించడంలో గొప్ప నైపుణ్యాన్ని కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రాక్టీస్‌లు రచయితలకు మరింత రాయడానికి, కొత్త ఐడియాలు సృష్టించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తాయని అభిప్రాయపడ్డారు.

BiggBoss 10: అమ్మబాబోయ్.. ఒకొక్కరికి అంత రెమ్యునరేషనా..! అందరికంటే ఎక్కువ ఎవరికో తెలుసా

తమిళ రచయితలు తరచుగా సినిమా అంశాలపై చర్చలు జరుపుకుంటూ ప్యాషన్‌తో ఉంటారని, తెలుగు రచయితల్లో ఈ గ్రూప్ డిస్కషన్ సంస్కృతి తక్కువని ప్రసాద్ ప్రస్తావించారు. దిల్ రాజు ఒకసారి తమిళ రచయితలు “రోజు కూలీలు” అని సరదాగా అన్నారని, హరీష్ శంకర్ తెలుగు రచయితలను “ప్రాజెక్ట్ ఇంజనీర్లు”గా అభివర్ణించారని గుర్తు చేశారు. తెలుగు రచయితల్లో సహకారం కంటే “ఈగో” సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ఒక ప్రాజెక్ట్‌కు ఇద్దరు లేదా ముగ్గురు రైటర్లు అవసరమైనప్పుడు కలిసి పనిచేయడం మంచిదని ఆయన అన్నారు. ఒక తమిళ్ దర్శకుడు తెలుగు సినిమా క్లాసిక్స్ గురించి అడిగినప్పుడు తాను హర్ట్ అయిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు, తెలుగు సినిమాకు 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని పేర్కొన్నారు. తెలుగు టెక్నీషియన్లకు కన్నడ పరిశ్రమలో మంచి గౌరవం ఉందని, ప్రస్తుతం మరాఠీ, భోజ్‌పురి, ఒరియా, హిందీ చిత్రాలకు కూడా తెలుగు రచయితలు పనిచేస్తున్నారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

BiggBoss10: ఊహించని ట్విస్ట్.. హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్.. అతను అవుట్.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us