AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలాంటి మనిషిని నేను చూడలేదు..! చాలా గొప్పోడు..!! కానీ 32ఏళ్లకే చనిపోయాడు: రామ్ గోపాల్ వర్మ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితంపై, సినీ ప్రస్థానంపై ఆసక్తికరమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను తన జీవితంలో ఎప్పుడూ ఏ విషయం గురించి పశ్చాత్తాపపడలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఓ నటుడి గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

అలాంటి మనిషిని నేను చూడలేదు..! చాలా గొప్పోడు..!! కానీ 32ఏళ్లకే చనిపోయాడు: రామ్ గోపాల్ వర్మ
Rgv
Rajeev Rayala
|

Updated on: Sep 08, 2026 | 8:19 PM

Share

మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో బ్రూస్ లీ ఒక అద్భుతమైన, అసమానమైన వ్యక్తిగా నిలిచారు. 1973లో 32 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన అకాల మరణం పాలవ్వడం ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని నింపింది, అనేక ఊహాగానాలకు దారితీసింది. “బ్రూస్ లీ 32 ఏళ్లకే ఎందుకు చనిపోయాడు?” అనే ప్రశ్నకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన విశ్లేషణను పంచుకున్నారు. బ్రూస్ లీ సినిమా కెరీర్ “వే ఆఫ్ ది డ్రాగన్”, “బిగ్ బాస్”, “చైనీస్ కనెక్షన్” వంటి చిత్రాలతో మొదలైంది. అయితే, “ఎంటర్ ది డ్రాగన్” చిత్రం ఆయనకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతకుముందు ఏషియన్ నటుడిని హీరోగా అంగీకరించడానికి వెనుకాడిన హాలీవుడ్ స్టూడియోల మధ్య “ఎంటర్ ది డ్రాగన్” ఒక సంచలనం సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన ఒక నెల ముందు, బ్రూస్ లీ దాని ఫస్ట్ కాపీ చూసి తన పనితీరు పట్ల ఎంతో సంతృప్తి చెందారని ఆర్జీవీ వివరించారు. తన కళను ప్రదర్శించడానికి ఇంతకంటే గొప్ప వేదిక దొరకదని ఆయన భావించారని ఆర్జీవీ అన్నారు.

బ్రూస్ లీ మరణం గురించి అనేక కుట్ర సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన్ను చంపేశారని, షాలిన్ మాంక్స్ అతన్ని శిక్షించారని, లేదా ప్రభుత్వమే అతన్ని అంతం చేసిందని వివిధ వార్తలు వచ్చాయి. ఎందుకంటే బ్రూస్ లీ లాంటి అత్యంత శక్తివంతమైన, సంపూర్ణ మానవుడు సాధారణంగా చనిపోతాడని ఎవరూ ఊహించలేకపోయారు. అతని మానసిక బలం, శారీరక సామర్థ్యం, పోరాట నైపుణ్యాలు అన్నీ అద్భుతమైనవి. అయితే, డెత్ సర్టిఫికెట్ ప్రకారం, బ్రూస్ లీ నొప్పి టాబ్లెట్ (ఆస్పిరిన్ లాంటిది) ప్రతికూల ప్రతిస్పందన కారణంగా మరణించారు, ఇది సెరిబ్రల్ ఎడెమాకు దారితీసింది.

దీనిపై ఆర్జీవీ మాట్లాడుతూ.. బ్రూస్ లీ రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు తీవ్రమైన శారీరక వ్యాయామం చేసేవారని, అతని శరీరంలో అసాధారణంగా తక్కువ కొవ్వు శాతం ఉండేవారని వర్మ వివరించారు. ఇది మానవ శరీరానికి సహజమైనది కాదని వైద్యులు అంతకుముందే హెచ్చరించారని వర్మ పేర్కొన్నారు. ఇంత తక్కువ కొవ్వు శాతం, కేవలం కండరాల నిర్మాణం వల్ల, సాధారణ నొప్పి నివారణ మందు మెదడులో ఊహించని నెగిటివ్ రియాక్షన్ కలిగించిందని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్లే ఆయన చనిపోయాడు అని ఆర్జీవీ అన్నారు. ఆర్జీవీ దృష్టిలో బ్రూస్ లీ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక ప్రకృతి శక్తి . కొహినూర్ వజ్రం లాగా, బ్రూస్ లీకి ఏ పోలిక లేదని, ఆయన ఒక కనీ వినీ ఎరుగని మనిషి అని ఆర్జీవీ అభివర్ణించారు. మొజార్ట్ లేదా అడాల్ఫ్ హిట్లర్ వంటి వ్యక్తులను కూడా ఆర్జీవీ ప్రకృతి శక్తులుగా పోల్చారు, ఆసియా మార్షల్ ఆర్ట్స్ పరిశ్రమలో జాకీ చాన్, జెట్ లీ, టోనీ జా వంటి ప్రముఖులు ఉన్నప్పటికీ, బ్రూస్ లీ స్థాయికి చేరుకున్న వారు ఎవరూ లేరని ఆర్జీవీ నొక్కి చెప్పారు. అతని కళ్ళలోని తీవ్రత, అతని వ్యక్తిత్వం అతని పంచ్ కంటే ఎక్కువ శక్తివంతమైనవని ఆర్జీవీ అన్నారు. బ్రూస్ లీ మరణించినందువల్లే ఒక స్మారక చిహ్నంగా మిగిలిపోయారని, ఆయన 70 ఏళ్లు జీవించి ఉంటే ప్రస్తుత గౌరవం ఉండేది కాదేమో అని ఆర్జీవీ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలిపారు.

ఇవి కూడా చదవండి

Prabhas Sreenu: ఆ హీరో ఎవ్వరికీ రికమెండ్ చేయడు.. చాలా మొహమాటస్తుడు : ప్రభాస్ శ్రీను

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us