నిన్ను ఎవరు గుర్తుపడతారు.. కనీసం గూగుల్ కూడా నీ పేరు రాదని అవమానించారు: వైష్ణవి చైతన్య
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. అయితే దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం, హైవే, బేబీ.. ఇలా డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఓ ఐడెంటిటీని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా సినిమా కథల ఎంపికలో ఆనంద్ దేవరకొండ చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాడు.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎపిక్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో, నటి వైష్ణవి చైతన్య మాట్లాడుతూ వేదికపై ఉన్న అతిథులకు, మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన రష్మిక, శివ నిర్వాణ, శైలేష్, సాయి మార్తాన్, కళ్యాణ్, వినోద్ వంటి ప్రముఖులకు ఆమె పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. దర్శకుడు శివ నిర్వాణను అభినందిస్తూ, ఆయన రూపొందించిన ఇరుముడి చిత్ర విజయానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నేను మా కుటుంబంతో కలిసి సినిమాను థియేటర్లో చూశాను. ముఖ్యంగా మా అమ్మమ్మ చాలా ఎమోషనల్ అయ్యారు, సినిమా బాగా నచ్చింది. ప్రతిరోజూ మా ఇంట్లో ఇరుముడి పాటలు వినిపిస్తూనే ఉంటాయి, అని వైష్ణవి పేర్కొన్నారు. యాల యాల పాట చాలా బాగుందని, దానిని లూప్‌లో వింటున్నానని హిషాంను అభినందించారు.
Jabardasth Komaram: జబర్దస్త్‌లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే.. ఆ అన్న వల్లే ఇప్పుడు ఇదంతా
సితార బ్యానర్‌లో నేను సినిమాలు చేస్తూనే వస్తున్నాను. ఇప్పుడు ఈ బ్యానర్‌లో ‘ఎపిక్’ని చేయడం ఆనందంగా ఉంది. మున్ముందు మరిన్ని మంచి చిత్రాల్ని చేయాలని కోరుకుంటున్నాను. ఆదిత్య గారు నా ఫేవరేట్ డైరెక్టర్, ఫ్రెండ్. కడలి పాత్రలో నన్ను చూసి, నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఆదిత్య గారికి థాంక్స్. అజీమ్ గారు మా అందరినీ అద్భుతంగా చూపించారు. ప్రతీ ఫ్రేమ్‌ని అందంగా మలిచారు. హేషమ్ గారు మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‘బేబి’ నుంచి ఆనంద్‌తో పరిచయం ఏర్పడింది. అప్పుడూ, ఇప్పుడూ ఆనంద్ ఒకేలా ఉన్నాడు. ఆనంద్‌లో ఎప్పుడూ ఒకేలా ఉండటం అనే ఆ లక్షణమే నాకు ఇష్టం. పక్కన వారు ఎదుగుతుంటే ఆనంద్ ఎక్కువగా సంతోషిస్తాడు. నాకు కళ్యాణ్ శంకర్ గారు ఈ సినిమాతో మంచి ఆర్టిస్ట్‌గా బిజీ అవుతారు. ‘ఎపిక్’ చిత్రం మంచి విజయం సాధిస్తుంది’ అని అన్నారు.
మంచి ఛాన్స్ మిస్ అయ్యాయంది.. ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..
అలాగే వైష్ణవి తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న రిజెక్షన్స్, అవమానాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది వైష్ణవి. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఒకరు నన్ను చాలా చులకనగా చూశారు. ‘అసలు నీకంటూ ఏం గుర్తింపు ఉంది.? నిన్ను ఎవరైనా గుర్తిస్తారా? గూగుల్‌లో నీ పేరు కొడితే కనీసం నీ పేరైన వస్తుందా?’ అని ముఖం మీదే ఎగతాళి చేశారు. ఆ సమయంలో నా దగ్గర ఎలాంటి విజయాలూ లేకపోవడంతో ఆ మాటలు నన్ను ఎంతగానో గాయపరిచాయి. ఆ బాధను మౌనంగా భరించడం తప్ప ఏమీ చేయలేకపోయాను” అంటూ వైష్ణవి చెప్పుకొచ్చారు.
8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.. రూ.25 కోట్లు పెడితే రూ.180 కోట్లు వచ్చాయి.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




