AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోని నేను నల్ల బావ అని పిలిచేదాన్ని.. దాంతో నన్ను మూడు రోజులు ఆడుకున్నారు

నటి హేమ తన సినీ ప్రయాణంలో అనేక మంది అగ్ర హీరోలతో కలిసి నటించారు. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్, నాని, బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్లతో కలిసి పనిచేశారు. పాతతరం నటులైన ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో నటించలేకపోయానని ఆమె కొంచెం విచారం వ్యక్తం చేశారు.

ఆ హీరోని నేను నల్ల బావ అని పిలిచేదాన్ని.. దాంతో నన్ను మూడు రోజులు ఆడుకున్నారు
Hema
Rajeev Rayala
|

Updated on: Sep 04, 2026 | 9:09 PM

Share

నటి హేమ సినీ పరిశ్రమలో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ, సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే పలువురు అగ్రశ్రేణి నటులతో కలిసి పనిచేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో, తన సినీ ప్రయాణం గురించి, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో పంచుకున్న కొన్ని ప్రత్యేకమైన, హాస్యభరితమైన జ్ఞాపకాలను ఆమె వివరించారు. హేమ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్, నాని, బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ వంటి ప్రస్తుత తరం స్టార్ హీరోలందరితో కలిసి నటించానని పేర్కొన్నారు. పాతతరం దిగ్గజాలైన ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గార్లతో ఎక్కువగా నటించలేకపోయినందుకు ఆమె కొంచెం బాధ వ్యక్తం చేశారు. అయితే, చిరంజీవి, నాగేశ్వరరావు గార్లతో కలిసి “మెకానిక్ అల్లుడు” అనే సినిమాలో నటించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

Jabardasth Komaram: జబర్దస్త్‌లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే.. ఆ అన్న వల్లే ఇప్పుడు ఇదంతా

తన చిన్నతనంలో సినిమా షూటింగ్‌లు ఎలా ఉండేవో, చెట్ల కిందే భోజనాలు చేయడం, లేడీస్ చెట్ల చాటున దుస్తులు మార్చుకోవడం వంటి జ్ఞాపకాలను కూడా హేమ పంచుకున్నారు. ఒకసారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా “పోకిరి” షూటింగ్ జరుగుతుండగా, హేమ అక్కడకు వెళ్లారు. పూరి జగన్నాథ్‌ను కలిసి, “మా నల్ల బావ షూటింగ్‌కు వచ్చాను” అని చెప్పారు. ఈ విషయం చిరంజీవికి పూరి జగన్నాథ్ చెప్పగా, చిరంజీవి హేమను మూడు రోజుల పాటు ఈ ముద్దుపేరుతో ఆటపట్టించారు. “నేను మరీ అంత నల్లగా ఉన్నానా.? నాగబాబు తెల్ల బావ అవుతాడా.? పవన్ కళ్యాణ్ చిన్న బావ అవుతాడా?” అంటూ చిరంజీవి హేమను సరదాగా ఆటపట్టించారు.

మంచి ఛాన్స్ మిస్ అయ్యాయంది.. ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..

పరుచూరి వెంకటేశ్వరరావు, ప్రకాష్ రాజ్ వంటి వారు సైతం అక్కడ ఉన్నారని హేమను సరదా చెప్పారు.  బ్రహ్మానందంతో కూడా చిరంజీవి సరదాగా ఆడుకుంటారని, ఆయనకు ఒక కోతి పిల్లను చూసినట్లు ఉంటుందని హేమ పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఎంత పెద్ద స్టార్ అయినా, ఆయనలో ఏమాత్రం గర్వం ఉండదని, చిన్నపిల్లలతో సహా అందరితో చాలా బాగా మాట్లాడతారని హేమ కొనియాడారు. ఆయన సాధారణత్వం, అందరితో కలిసిపోయే తత్వం ఆమెను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు.

8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.. రూ.25 కోట్లు పెడితే రూ.180 కోట్లు వచ్చాయి.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్‌.. హైదరాబాదీ ఆవేదన!
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్‌.. హైదరాబాదీ ఆవేదన!
బ్యాంకుకు వచ్చేవాళ్లంతా కస్ట్‌మర్లే కాకపోవచ్చు.. జాగ్రత్త
బ్యాంకుకు వచ్చేవాళ్లంతా కస్ట్‌మర్లే కాకపోవచ్చు.. జాగ్రత్త
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్‌.. దెబ్బకు కళ్లు బైర్లు
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్‌.. దెబ్బకు కళ్లు బైర్లు
చాట్‌జీపీటీలో కొత్త ‘ప్రైవసీ సెంటర్’ ఇక మీ డేటా సేఫ్..
చాట్‌జీపీటీలో కొత్త ‘ప్రైవసీ సెంటర్’ ఇక మీ డేటా సేఫ్..
ఇంట్లో వెండి నెమలి పెడితే ఏం జరుగుతుందో తెలుసా..? అదృష్టం..
ఇంట్లో వెండి నెమలి పెడితే ఏం జరుగుతుందో తెలుసా..? అదృష్టం..
‘ఏఐ’కి కొత్త పేరు పెట్టిన ట్రంప్‌.. ఇక నుంచి అలాగే పిలవాలట!
‘ఏఐ’కి కొత్త పేరు పెట్టిన ట్రంప్‌.. ఇక నుంచి అలాగే పిలవాలట!
రామాయణం మూవీ.. 'జయ జయ రామ్' సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది
రామాయణం మూవీ.. 'జయ జయ రామ్' సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది
రైతన్నలకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
రైతన్నలకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
ఐఆర్‌సీటీసీ అద్భుత టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అజంతా, ఎల్లోరా
ఐఆర్‌సీటీసీ అద్భుత టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అజంతా, ఎల్లోరా
ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయాక..
ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయాక..