AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాశి, రాశి ఖన్నా ఇద్దరు హీరోయిన్స్‌తో కలిసి నటించిన హీరో ఎవరో తెలుసా.? చెప్పుకోండి చూద్దాం.!

ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి ఆ తర్వాత హీరోయిన్ గానూ సక్సెస్ అయిన వారిలో రాశి ఒకరు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ కథానాయికగా చేసిందీ అందాల తార. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది. శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, గోకులంలో సీత, గిల్లి కజ్జాలు, ప్రేయసి రావే, పోస్ట్ మ్యాన్, అమ్మో ఒకటో తారీఖు, సందడే సందడి, శ్రీరామ చంద్రులు నటి రాశికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

రాశి, రాశి ఖన్నా ఇద్దరు హీరోయిన్స్‌తో కలిసి నటించిన హీరో ఎవరో తెలుసా.? చెప్పుకోండి చూద్దాం.!
Rashi Raashi Khanna
Rajeev Rayala
|

Updated on: Sep 04, 2026 | 7:11 PM

Share

సీనియర్ హీరోయిన్ రాశి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి అలరించారు రాశి. అప్పట్లో రాశికి కుర్రాళ్లలో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు రాశి. ఇక రాశి అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో మరో రాశి కూడా దూసుకుపోతుంది. ఆమె రాశి ఖన్నా.. ఈ కుర్ర హీరోయిన్ ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే కెరీర్ లో మంచి హిట్స్ కూడా అందుకుంది ఈ చిన్నది. ముందుగా ఈ చిన్నది బాలీవుడ్ లో సినిమాలు చేసింది. ఆతర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ.

Jabardasth Komaram: జబర్దస్త్‌లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే.. ఆ అన్న వల్లే ఇప్పుడు ఇదంతా

మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే అందం, నటన పరంగాను రాశీ ఖన్నాకు మంచి మార్కులు పడ్డాయి.ఇక రాశీ ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లోనూ ఛాన్స్ లు అందుకుంది. తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమాలోనూ నటించింది. కానీ ఈ అమ్మడు అంతగా అవకాశాలు రావడం లేదు. ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ చిన్నది సినిమాల స్పీడ్ తగ్గించింది.

మంచి ఛాన్స్ మిస్ అయ్యాయంది.. ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..

కాగా సీనియర్ రాశి, యంగ్ హీరోయిన్ రాశి ఈ ఇద్దరితో కలిసి నటించిన హీరో ఎవరో తెలుసా.? ఆ హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవును ఈ ఇద్దరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించారు. సీనియర్ హీరోయిన్ రాశి పవన్ కళ్యణ్ కలిసి గోకులం లో సీత సినిమాలో నటించారు. ఈ విజయాన్ని అందుకుంది. ఆతర్వాత పవన్ కళ్యాణ్ రాశి ఖన్నా కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇలా ఇద్దరూ రాశిలాతో కలిసి నటించిన హీరో పవన్ కళ్యాణ్.. అయితే గోపీచంద్  సరసన కూడా ఈ ఇద్దరూ నటించారు. నటించిన నిజం సినిమాలో సీనియర్ నటి రాశి నటించారు, అలాగే గోపిచంద్ జిల్ లో రాశి ఖన్నా నటించింది.

ఇవి కూడా చదవండి

8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.. రూ.25 కోట్లు పెడితే రూ.180 కోట్లు వచ్చాయి.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us