Ravi Teja: రూటు మార్చిన రవితేజ.. మొదటిసారి అలాంటి స్టోరీతో రానున్న మాస్ రాజా
బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు, భక్తిరస లేదా విభిన్న కథాంశంతో వచ్చే సినిమాలు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఇరుముడి’ థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తూ ఏకంగా రూ. 200 కోట్ల వసూళ్ల మైలురాయిని అధిగమించింది. సాదాసీదాగా థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది.

మాస్ మహారాజ రవితేజ రీసెంట్ గా ఇరుముడి సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అలాగే కలెక్షన్స్ పరంగానూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుంది. చాలా కాలం తర్వాత రవితేజ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రవితేజ తన నటనతో కట్టిపడేసాడు. ఇరుముడి సినిమా తాజాగా రూ. 200కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దాంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అలాగే ఇప్పుడు రవితేజ నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. రవితేజ ఎవరితో సినిమా చేయబోతున్నాడు. ఎలాంటి కథతో రాబోతున్నాడు అని ఆయన అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
Jabardasth Komaram: జబర్దస్త్‌లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే.. ఆ అన్న వల్లే ఇప్పుడు ఇదంతా
ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ రెండు సినిమాలను లైనప్ చేశారు. యువ దర్శకుడు హసిత్ గోలి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు రవితేజ. ఈ సినిమాలో మరో హీరో శ్రీవిష్ణు కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా కామెడీ కంటెంట్ తో తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మాస్ రాజా. అయితే ఈ సినిమా లైన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.
మంచి ఛాన్స్ మిస్ అయ్యాయంది.. ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..
మునుపెన్నడూ చేయని కథతో రవితేజ సినిమా చేస్తున్నారు. అదే హారర్ కామెడీ. రవితేజ తన కెరీర్ లో ఎప్పుడు హారర్ సినిమాలు చేయలేదు. మొదటి సారి ఇప్పుడు అలాంటి కథతో రానున్నారని తెలుస్తుంది. మాస్ రాజా రవితేజ, వివేక్ ఆత్రేయ కామెబినేషన్ లో అదిరిపోయే హారర్ కామెడీ సినిమా రానుందని ఇండస్ట్రీలో ఇన్ సైడ్ టాక్ మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.. రూ.25 కోట్లు పెడితే రూ.180 కోట్లు వచ్చాయి.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




