AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BiggBoss 10: అమ్మబాబోయ్.. ఒకొక్కరికి అంత రెమ్యునరేషనా..! అందరికంటే ఎక్కువ ఎవరికో తెలుసా

బిగ్ బాస్ గేమ్ షో తెలుగులో ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గేమ్ షో ఇప్పటికే 9 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 10 ప్రారంభం అయ్యింది. గత సీజన్ల కంటే ఈసారి బిగ్ బాస్ షో మరింత కలర్ ఫుల్ గా ఉండనుంది.

BiggBoss 10: అమ్మబాబోయ్.. ఒకొక్కరికి అంత రెమ్యునరేషనా..! అందరికంటే ఎక్కువ ఎవరికో తెలుసా
Biggboss 10
Rajeev Rayala
|

Updated on: Sep 07, 2026 | 12:39 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ గా మొదలైంది. ఆదివారం (ఈ నెల 6న)సీజన్ 10 మొదలైంది. ఈసారి హౌస్ లోకి పలువురు సెలబ్రిటీలు, అలాగే కొంతమంది సాధారణ వ్యక్తులు (కామనర్లు) హౌస్‌లోకి ప్రవేశించారు. మొత్తంగా 16మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో 10మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు హౌస్ లోకి వెళ్లిన వారి రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఒకొక్కరు వారానికి లక్షల్లో అందుకుంటున్నారని, ఎవరి ఫేమ్ ను బట్టి వారికి భారీ రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారని అంటున్నారు. మరి హౌస్ లోకి వెళ్లిన వారు ఎవరు వారి రెమ్యునరేషన్ ఎంతో ఒక్కసారి చూద్దాం. ముందుగా హౌస్ లోకి వెళ్లిన వారు వీరే.. సీరియల్ నటి దేబ్జానీ మోదక్, త్రిగుణ్ (ఆదిత్ అరుణ్), సింగర్ ఝాన్సీ, యాంకర్ సుధీర్ రెడ్డి, అమన్ మసూద్, చైత్రా రాయ్, రాం ప్రసాద్, షాలిని, టెంపర్ వంశీ, సృష్టి వ్యాకరణం,జబర్దస్త్ నరేష్, ఆర్జే చరణ్, నటుడు కృష్ణుడు, యాంకర్ వర్షిణి, రోహిత్ నాయుడు, ముఖేష్ గౌడ ఈ 16మంది హౌస్ లోకి అడుగుపెట్టారు.

అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు సెట్ బాయ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్

ఇక వారి రెమ్యునరేషన్స్ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో జబర్దస్త్ నరేష్ వారానికి రూ.2.5 లక్షలు అందుకుంటున్నట్లు సమాచారం. ఆయన జబర్దస్త్ షో ద్వారా సాధించిన గుర్తింపు వల్ల ఈ రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. త్రిగున్ అలియాస్ ఆదిత్ ఈశ్వరన్‌కు రూ.2.75 లక్షలు. యాంకర్ సుధీర్ రెడ్డికి రూ. 1.25 లక్షలు, సీరియల్ నటి దేబ్జానీ రూ.2.75 లక్షలు పర్ వీక్ తీసుకుంటున్నారు. క్యూట్ క్యూట్‌గా వచ్చిరాని తెలుగులో మాట్లాడటం ఆమెకు ప్లస్ పాయింట్. యాంకర్ వర్షిణి  అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో ఒకరు. ఆమెకు వారానికి రూ. 3.5 లక్షలు చెల్లిస్తున్నారు. ఆమెకు ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఎందుకని చాలామందికి సందేహం రావచ్చు. దీనికి ప్రధాన కారణం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ప్లస్ ఫాలోవర్లు ఉండటమే. అంతేకాకుండా, గత మూడు, నాలుగు సీజన్‌ల నుండి బిగ్ బాస్ టీమ్ ఆమెను సంప్రదిస్తూనే ఉంది, ప్రతిసారీ ఆమె నో చెబుతూ వస్తున్నారు. ఈసారి ఆమె అంగీకరించడంతో, ఆమె క్రేజ్‌కు తగ్గట్టుగా రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది.

నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడారు.. సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్

ఇక టెంపర్ వంశీ వారానికి రూ. 2 లక్షలు అందుకుంటున్నారు. వినాయకుడు మూవీ హీరో కృష్ణుడు కూడా వారానికి రూ. 2 లక్షలు, చైత్ర రాయ్‌కు వారానికి రూ. 2.5 లక్షలు అందుకుంటున్నారని తెలుస్తుంది. అలాగే ఈ సీజన్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్నది జబర్దస్త్ రాంప్రసాద్. ఆయనకు వారానికి ఏకంగా రూ.4.5 లక్షలు లభిస్తోంది. ఇక మిగిలిన వారిలో ముఖేష్ గౌడకు వారానికి రూ. 3 లక్షలు. సెలబ్రిటీల పారితోషికాల తర్వాత, కామనర్‌ల విషయానికి వస్తే, ఈ సీజన్‌లో ఆరుగురు కామనర్లు ఎంటర్ అయ్యారు. గత సీజన్‌లో బిగ్ బాస్ టీమ్ ఒక్కొక్క కామనర్‌కు వారానికి రూ. 70,000 ఇచ్చింది. గత సీజన్‌లో అగ్నిపరీక్ష జరుగుతున్న సమయంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఈ సీజన్‌లో అగ్నిపరీక్షకు హాజరైన 15 మందికి ఒక్కొక్కరికి రూ.50,000 చెల్లించారు. ఇక హౌస్‌లోకి ఎంటర్ అయిన ఆరుగురు కామనర్‌లకు గత సీజన్ మాదిరిగానే వారానికి రూ.70,000 రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

నిన్ను ఎవరు గుర్తుపడతారు.. కనీసం గూగుల్ కూడా నీ పేరు రాదని అవమానించారు: వైష్ణవి చైతన్య

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us