AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడారు.. సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్

ఫిలిం ఫెడరేషన్, డ్యాన్సర్స్ అసోసియేషన్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది.ఇటీవలే రఘు మాస్టర్‌ను టెంపరరీ ప్రెసిడెంట్‌గా సభ్యులు ఎన్నుకున్నారు. ఆతర్వాత సుమలత కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే యూనియన్ ఆధిపత్యం, అధికారిక గుర్తింపు, బ్యాంకు లావాదేవీలు, నిధుల నిర్వహణ వంటి అంశాలపై రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌ చేరుకున్నారు.

నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడారు.. సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్
Sekhar Master
Rajeev Rayala
|

Updated on: Sep 05, 2026 | 8:00 PM

Share

సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలని శేఖర్ మాస్టర్ అన్నారు. జానీ మాస్టర్ సతీమణి సుమలత పై ఫెడరేషన్ కు అలాగే డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్ కి కంప్లైంట్ చేశారు శేఖర్ మాస్టర్. అలాగే సుమలత, సీనియర్ డాన్సర్ లక్షి తన పై అనుచిత వ్యాఖ్యలు చేశారని శేఖర్ మాస్టర్ పిర్యాదు చేశారు. అనంతరం శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. సుమలత, సీనియర్ డాన్సర్ లక్షి చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధించాయని అన్నారు. అదేవిధంగా నా ప్రమేయం లేకుండా ఎలాంటి నిరూపితం ఆధారం లేకుండా నా మనోభావాలు దెబ్బతినేలా సుమలత అనుచిత వ్యాఖ్యలు చేశారు, నా పుట్టు పూర్వోత్తరాలు గురించి కూడా మాట్లాడారని శేఖర్ మాస్టర్ అన్నారు.

కక్కితే కాళ్లమీద పడతాయి అని నాపై అభియోగాలు మోపి నిందలు వేసి చాలా వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడారని శేఖర్ మాస్టర్ అన్నారు. ఈ గొడవలు వద్దు అని మీడియా ముందుకు రావద్దు అని పెద్దలు చెప్పారని వారి మీద గౌరవంతో ఉన్నాను, కానీ సుమలత ప్రవర్తించిన తీరు నాకు చాలా బాధాకరం అయ్యింది. నా యూనియన్ సభ్యులకోసం సహాయ సహకారంలో అందించడంలో ముందు ఉంటాను. యూనియన్ సభ్యులకు పర్సెంటేజ్ విషయంలో అన్యాయం జరుగుతుంటే ఎన్ని సాంగ్స్ ని వదులుకున్నా.. అనుచిత వ్యాఖ్యలుచేసిన సుమలత, సీనియర్ లక్ష్మి బహిరంగ క్షమాపణ చెప్పాలని శేఖర్ మాస్టర్ డిమాండ్ చేశారు.

ఫిలిం ఫెడరేషన్, డ్యాన్సర్స్ అసోసియేషన్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది.ఇటీవలే రఘు మాస్టర్‌ను టెంపరరీ ప్రెసిడెంట్‌గా సభ్యులు ఎన్నుకున్నారు. ఆతర్వాత సుమలత కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే యూనియన్ ఆధిపత్యం, అధికారిక గుర్తింపు, బ్యాంకు లావాదేవీలు, నిధుల నిర్వహణ వంటి అంశాలపై రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌ చేరుకున్నారు. కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ నేతృత్వంలోని వర్గానికి, సంఘం నాయకురాలు సుమలత ప్యానెల్‌కు మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణ పల్లెటూరి బిడ్డకు జాతీయ కిరీటం
తెలంగాణ పల్లెటూరి బిడ్డకు జాతీయ కిరీటం
హైదరాబాద్‌ ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్..
హైదరాబాద్‌ ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్..
యూపీఐ పేమెంట్స్ బంద్..? పలు ప్రాంతాల్లో సేవలకు అంతరాయం..
యూపీఐ పేమెంట్స్ బంద్..? పలు ప్రాంతాల్లో సేవలకు అంతరాయం..
షార్క్‌ల మధ్య యువకుడి ప్రపోజల్ .. షాక్‌లో యువతి!
షార్క్‌ల మధ్య యువకుడి ప్రపోజల్ .. షాక్‌లో యువతి!
TGPSC గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ మారుతుందా? కమిషన్ క్లారిటీ
TGPSC గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ మారుతుందా? కమిషన్ క్లారిటీ
కేవలం 10 నిమిషాల్లో చేసే దూదిలాంటి అటుకుల దోశలు..
కేవలం 10 నిమిషాల్లో చేసే దూదిలాంటి అటుకుల దోశలు..
2027లో ప్రపంచ టాప్ డెస్టినేషన్స్‌లో భారత్.. ఈ రెండు ప్రాంతాలకే..
2027లో ప్రపంచ టాప్ డెస్టినేషన్స్‌లో భారత్.. ఈ రెండు ప్రాంతాలకే..
తులా రాశిలో బుధుడు.. ఈ రాశుల వారికి కష్టనష్టాల నుంచి విముక్తి
తులా రాశిలో బుధుడు.. ఈ రాశుల వారికి కష్టనష్టాల నుంచి విముక్తి
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ టార్గెట్‌గా అభిజీత్‌ దిప్కే కీలక వ్యాఖ్యలు
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ టార్గెట్‌గా అభిజీత్‌ దిప్కే కీలక వ్యాఖ్యలు
ఇంటి గోడల్లో, నేల కింద, ఫర్నిచర్ లో డబ్బే డబ్బు.. మాఫియా ఇళ్లల్లో
ఇంటి గోడల్లో, నేల కింద, ఫర్నిచర్ లో డబ్బే డబ్బు.. మాఫియా ఇళ్లల్లో