AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న పల్లెటూరి నుంచి అగ్నిపరీక్ష వరకు.. వాళ్లకు నాకు ఐఫోన్, నోకియా ఫోన్‌కు ఉన్నంత తేడా ఉంది

తాజాగా ఓ ఇంటర్వ్యూలో, అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రాజకుమారి తన జీవిత పోరాటాలను, పిల్లల భవిష్యత్తు కోసం ఆమె పడిన కష్టాలను పంచుకున్నారు. ఆర్థిక సవాళ్లు, వ్యక్తిగత ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఆమె సాధించిన విజయాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. తన ప్రయాణంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నా అని ఆమె తెలిపారు.

చిన్న పల్లెటూరి నుంచి అగ్నిపరీక్ష వరకు.. వాళ్లకు నాకు ఐఫోన్, నోకియా ఫోన్‌కు ఉన్నంత తేడా ఉంది
Raja Kumari
Rajeev Rayala
|

Updated on: Sep 07, 2026 | 1:33 PM

Share

అగ్నిపరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్ రాజకుమారి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో తన ఆటతో అందరిని ఆకట్టుకున్నారు. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజకుమారి తన జీవిత ప్రస్థానాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు. రాజకుమారి తన వ్యక్తిగత బాధలను, భయాలను పక్కన పెట్టి, తన పిల్లల కోసం, తన కోసం తాను నిలబడాలని నిశ్చయించుకున్నారు. అగ్నిపరీక్ష వేదికపై ఆమె భావోద్వేగాలను కొందరు సింపతీ కార్డు అని కొందరు అన్నారు. అయితే ఆమె తన కథను బయటకు చెప్పడం ద్వారా ఎంతో మంది మహిళలకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. బయట చాలా మంది మహిళలు తనను చూసి తమ కష్టాలను పంచుకున్నారని, అది తనకు గొప్ప గర్వంగా అనిపించిందని రాజకుమారి తెలిపారు. “మీ విజయం మీ ఒక్కరిదే కాదు, మా అందరి విజయం” అని మహిళలు చెప్పినప్పుడు తనకు చాలా ఆనందంగా అనిపించిందని తెలిపారు.

అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు సెట్ బాయ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్

చిన్న పల్లెటూరి నుంచి హైదరాబాద్ వచ్చి అగ్నిపరీక్ష వంటి పెద్ద షోలో పాల్గొనడం, అక్కడ ఉన్న మేధావులు, పర్సనాలిటీ ఉన్నవారితో పోటీ పడటం తనకు చాలా పెద్ద టాస్క్‌గా ఆమె అన్నారు. ఐఫోన్, నోకియా ఫోన్‌కు ఉన్నంత తేడా తనకు, ఇతర పోటీదారులకు మధ్య ఉందని, తనను ఒక అక్వేరియంలోని చేపను సముద్రంలోకి విసిరేసినట్లు అనిపించిందని రాజకుమార్ అన్నారు. అయితే, పిల్లల భవిష్యత్తు కోసం, తన కష్టాల కన్నా పెద్దవి ఏవీ లేవని ముందుకు సాగారట. ముగ్గురు పిల్లలు, మూడు సర్జరీలు, ఒక యాక్సిడెంట్, ఫేషియల్ సర్జరీలు ఆమె ఎదుర్కొన్న సవాళ్లలో కొన్ని..

నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడారు.. సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్

ఆర్థికంగా రాజకుమారి చాలా ఇబ్బందులు పడ్డారు. టైలరింగ్ చేసి కుటుంబాన్ని పోషించారు. తన సోదరుడు, తండ్రి (దుబాయ్ నుంచి) కూడా కొంత ఆర్థిక సహాయం అందించినా, పిల్లల ఫీజులు, పుస్తకాలు, బట్టలు సకాలంలో అందించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు టీవీలో తనను చూసి సంతోషపడటం, స్కూల్లో చెప్పుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. సొంత ఇల్లు కట్టుకోవడం తన జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణంగా ఆమె అభివర్ణించారు. ఆరు నెలల చిన్న బాబును, రెండు సంవత్సరాల పాపను చూసుకుంటూ, తానే దగ్గరుండి ఇల్లు కట్టించడం తనకు నరకం చూపించిందని గుర్తు చేసుకున్నారు. అప్పటి వరకు తమకు సొంత చిరునామా లేదని, ఆధార్ కార్డుకు అడ్రస్ ఇవ్వడానికి ఇబ్బందులు పడ్డామని తెలిపారు. జీవితంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిన ప్రతిసారీ తన పిల్లలు గుర్తుకొచ్చేవారని, వారు అనాథలు కాకూడదనే భయమే తనను ముందుకు నడిపించిందని రాజకుమారి చెప్పారు.

ఇవి కూడా చదవండి

నిన్ను ఎవరు గుర్తుపడతారు.. కనీసం గూగుల్ కూడా నీ పేరు రాదని అవమానించారు: వైష్ణవి చైతన్య

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us