AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్, ఎసిడిటీ ఇక చిటికెలో మాయం.. పడుకునే ముందు ఇవి 2 తింటే చాలు..

తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపుబ్బరంతో బాధపడుతున్నారా? రాత్రంతా కంటిమీద కునుకు ఉండట్లేదా? అయితే ఈ చిన్న వంటింటి చిట్కా మీ కోసమే. పడుకునే ముందు రెండు యాలకులు నమలడం వల్ల జీర్ణవ్యవస్థ ఎలా మెరుగవుతుంది, ప్రశాంతమైన నిద్ర ఎలా పడుతుందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

గ్యాస్, ఎసిడిటీ ఇక చిటికెలో మాయం.. పడుకునే ముందు ఇవి 2 తింటే చాలు..
Eating Cardamom At Night
Krishna S
|

Updated on: Sep 11, 2026 | 9:59 PM

Share

మన వంటింట్లో సుగంధ ద్రవ్యాల రాణిగా పిలిచే యాలకులు కేవలం వంటకాలకు రుచి, సువాసన ఇవ్వడానికే పరిమితం కాదు.. అవి శరీరానికి సంజీవనిలా పనిచేసే అద్భుత ఔషధ గుణాల గని. ప్రతి రాత్రి పడుకునే ముందు కేవలం ఒకటి లేదా రెండు యాలకుల కాయలను నమిలి, ఆపై గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ సాబో సూర్య ప్రకాష్ స్పష్టం చేస్తున్నారు. యాలకులలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, సహజ సుగంధ నూనెలు శరీర వ్యవస్థను ఎలా రీఛార్జ్ చేస్తాయో వైద్యుల మాటల్లోనే తెలుసుకుందాం.

రాత్రిపూట యాలకులు తినడం వల్ల కలిగే 3 ప్రధాన ప్రయోజనాలు

జీర్ణవ్యవస్థకు దివ్యౌషధం: రాత్రి భోజనం తర్వాత చాలామందిని వేధించే ప్రధాన సమస్య కడుపు ఉబ్బరం, అజీర్ణం. పడుకునే ముందు యాలకులను నమలడం వల్ల నోట్లో లాలాజలంతో పాటు కడుపులో జీర్ణరసాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ఇది రాత్రి తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసి, ఉదయానికల్లా గ్యాస్, ఎసిడిటీ, గుండెల్లో మంట, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

నాడీ వ్యవస్థ రిలాక్స్.. నిద్రలేమికి బైబై: యాలకుల్లోని సహజ సుగంధ సమ్మేళనాలు శరీర నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతాయి. ఇవి మెదడులోని ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మనస్సును ప్రశాంతపరుస్తాయి. రాత్రిళ్లు పడకపై ఎంతకీ నిద్రపట్టక ఇబ్బందిపడేవారికి యాలకులు సహజ నిద్రమాత్రలా పనిచేసి గాఢమైన, నాణ్యమైన నిద్ర పట్టేలా చేస్తాయి.

నోటి దుర్వాసన మాయం.. గురక సమస్యకు ఉపశమనం: యాలకులలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు నోట్లోని హానికర బ్యాక్టీరియాను సమర్థవంతంగా అరికడతాయి. దీనివల్ల ఉదయం లేవగానే వచ్చే నోటి దుర్వాసన సమస్య శాశ్వతంగా తగ్గుతుంది. అంతేకాకుండా రాత్రి శ్వాసనాళాల్లో పేరుకుపోయే శ్లేష్మాన్ని తొలగించి, గొంతు నొప్పి, గురక వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

యాలకులను ఎలా తీసుకోవాలి? సరైన పద్ధతి ఇదే..

సరైన సమయం: రాత్రి నిద్రపోవడానికి 20 నుంచి 30 నిమిషాల ముందు ఈ పద్ధతి పాటించాలి.

తీసుకునే విధానం: ఒకటి లేదా రెండు పచ్చి యాలకుల కాయలను నోట్లో వేసుకుని రసం దిగేలా బాగా నమలాలి. అనంతరం ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి.

మరో మార్గం: నేరుగా నమలడం ఇష్టం లేనివారు, కొద్దిగా యాలకుల పొడిని గోరువెచ్చని పాలలో మరిగించి కూడా తాగవచ్చు.

ఖరీదైన ఔషధాలు, విటమిన్ సప్లిమెంట్ల వెంట పడకుండా.. వంటింట్లో లభించే ఈ చిన్న మసాలా గింజను నిత్య అలవాటుగా మార్చుకుంటే కడుపు తేలికగా మారి, ఆరోగ్యం పదిలంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us