AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో అంటే నాకు పిచ్చి ఇష్టం.. ఆ సినిమాలో ఆయను చూసి ఫిదా అయిపోయా : నటి హేమ

ప్రముఖ నటి హేమ, ఓ స్టార్ హీరో పట్ల తనకున్న అపారమైన అభిమానాన్ని, ఆయనతో తన అనుభవాలను పంచుకున్నారు. ఒకసారి ఆ హీరో తన ఇంటి పక్కన ఉన్న స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో షూటింగ్ చేస్తుండగా, భోజనానికి ఆహ్వానించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. లంచ్‌కు రానని చెప్పినప్పటికీ, పది నిమిషాలు వస్తానని హామీ ఇచ్చి వచ్చారన్నారు.

ఆ హీరో అంటే నాకు పిచ్చి ఇష్టం.. ఆ సినిమాలో ఆయను చూసి ఫిదా అయిపోయా : నటి హేమ
Hema
Rajeev Rayala
|

Updated on: Sep 11, 2026 | 10:22 PM

Share

ప్రముఖ నటి హేమ, తన సినీ ప్రస్థానంలో ఎదురైన మధురానుభూతులను, ముఖ్యంగా అక్కినేని నాగార్జున పట్ల తనకున్న అపారమైన అభిమానాన్ని, గౌరవాన్ని పంచుకున్నారు. తన ఇంటి పక్కన ఉన్న స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నాగార్జున షూటింగ్ చేస్తున్నప్పుడు, ఆయనను భోజనానికి ఆహ్వానించిన అరుదైన సంఘటనను హేమ గుర్తుచేసుకున్నారు. లంచ్‌కు రాలేనని చెప్పినప్పటికీ, పది నిమిషాలు తన ఇంటికి వస్తానని నాగార్జున హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హేమ, తన సహాయకుడైన చంద్ర సహాయంతో, నాగార్జునకు ఇష్టమైన చాపల పులుసు, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, రసం వంటి వంటకాలను సిద్ధం చేసి టేబుల్‌పై పెట్టారు. అయితే నాగార్జున వచ్చిన వెంటనే, “ఎందుకు ఇన్ని వంటకాలు చేశావు, ఒకటే చేయమని చెప్పాను కదా, లంచ్‌కు రానన్నాను కదా” అని అన్నారు. కానీ హేమ మాత్రం “పర్లేదు బాబు, కొంచెం అది, కొంచెం ఇది” అంటూ ప్రేమగా వడ్డించారట. అది తన జీవితంలో ఒక మర్చిపోలేని రోజు అని హేమ అన్నారు.

ఆ హీరోయిన్‌ను చూస్తే ఎవ్వరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది.. చాలా మంచింది : గుణశేఖర్

నాగార్జున పట్ల తనకున్న అభిమానాన్ని “ప్రాణం” లేదా “పిచ్చి” అని హేమ అభివర్ణించారు. చిరంజీవిని “బావగారు”గా, ఇంటికి పెద్ద దిక్కుగా గౌరవిస్తానని, నాగార్జున గారిని మాత్రం తన “ఫ్రెండ్‌”గా, “బాయ్‌ఫ్రెండ్‌”లా భావిస్తానని ఆమె తెలిపారు. గీతాంజలి, శివ వంటి చిత్రాలతో నాగార్జున తెలుగు సినిమాకు కొత్త రొమాంటిక్ కోణాన్ని, లిప్ లాక్‌లు లేని రోజుల్లోనే రొమాంటిక్ సన్నివేశాలను పరిచయం చేశారని, ఆయన్ని చూసి తాను ఫిదా అయ్యానని హేమ వెల్లడించారు. నాగార్జున అంటే తనకు క్రష్ అని, ఈ విషయం ఆయనకు ఎప్పటి నుంచో తెలుసని కూడా హేమ చెప్పారు.

BiggBoss 10: అమ్మబాబోయ్.. ఒకొక్కరికి అంత రెమ్యునరేషనా..! అందరికంటే ఎక్కువ ఎవరికో తెలుసా

వారసుడు సినిమా షూటింగ్ సమయంలో నగ్మాతో తనకు ఉన్న స్నేహబంధాన్ని హేమ గుర్తుచేసుకున్నారు. తెలుగు రాకపోవడంతో నగ్మాను ఎవరైనా ఏడిపిస్తే, హేమ ఏమంటున్నారు వీళ్ళు అని అడిగేదని చెప్పారు. తర్వాత గొప్పింటి అల్లుడు సినిమా షూటింగ్‌లో బాలయ్య బాబుతో కలిసి నటిస్తున్నప్పుడు, పక్కనే ఏడు ఎకరాల్లో నాగార్జున షూటింగ్ జరుగుతుండేదని, తాను రోజు ఆయన్ని దూరంగా చూస్తూ ఉండేదాన్నని హేమ అన్నారు. అప్పుడు తన సహనటి సంఘవి (కృష్ణవంశీ ద్వారా హేమకు పరిచయం) “ఏం చూస్తున్నావు?” అని అడిగితే, “నాగార్జున గారిని, ఎంత బాగున్నారు కదా” అని చెప్పేదాన్నని తెలిపారు. ఒకసారి సంఘవి చొరవ తీసుకుని హేమను నాగార్జున వద్దకు తీసుకెళ్లి, “ఈ పిల్లకు మీరంటే ఎంత ఇష్టమో తెలుసా, మిమ్మల్నే చూస్తూ ఉంటుంది” అని పరిచయం చేసిందని హేమ చెప్పారు. అప్పుడు తను నాగార్జునతో మాట్లాడలేక, సిగ్గుపడిందని, ఆయన తన గోరింటాకు పెట్టుకున్న కాళ్లను చూసి “నాకు గోరింటాకు కావాలి” అని అడగగానే, వెంటనే చీర కట్టుకుని కాళ్లను లోపలికి లాగేసుకున్నానని హేమ నవ్వుతూ చెప్పారు.

ఇవి కూడా చదవండి

BiggBoss10: ఊహించని ట్విస్ట్.. హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్.. అతను అవుట్.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us