రూ. 25 కోట్ల ఆస్తి కోసం కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి జగదీశ్వర్ రెడ్డిని చంపినట్లు సాదిక్ ఖాన్ అంగీకరించాడు. మొదట బుకాయించినప్పటికీ, పోలీసులు ఆధారాలు చూపడంతో నేరం ఒప్పుకున్నాడు. చిన్న మోతాదుల విషంతో మొదలుపెట్టి, చివరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజే ప్రాణాలు తీశాడు. ఈ హత్యలో మరో వ్యక్తి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.