AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zareen Khan: జరీన్ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 30 కిలోల బరువుతో స్క్వాట్స్! 

సినిమా వెండితెరపై తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుని, మెస్మరైజ్ చేసి మెప్పించే ఆ నటి, ప్రస్తుతం జిమ్‌లో తన శక్తి సామర్థ్యాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా హీరోయిన్లు యోగా లేదా కార్డియో వ్యాయామాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని చాలా మంది భావిస్తూ ఉంటారు.

Zareen Khan: జరీన్ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 30 కిలోల బరువుతో స్క్వాట్స్! 
Zareen
Nikhil
|

Updated on: Feb 26, 2026 | 8:58 PM

Share

కానీ, ఈ అందాల భామ మాత్రం ఏకంగా 20+ కిలోల బరువును ఎత్తి ‘గోబ్లెట్ స్క్వాట్స్’ చేస్తూ ఫిట్‌నెస్ ప్రియుల మతి పోగొడుతోంది. ఆమె వర్కవుట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ఆమె ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సరసన పరిచయమై, తన రూపంతో అందరినీ ఆకట్టుకుంది. కాలక్రమేణా తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఈ నటి, ఇప్పుడు ఏకంగా హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కనిపిస్తోంది. 38 ఏళ్ల వయసులో కూడా ఇంతటి శక్తి ఆమెకు ఎక్కడ నుండి వచ్చింది? తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో 70 పౌండ్ల (30 కిలోల) బరువును పట్టుకుని స్క్వాట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ పవర్‌ఫుల్ వర్కవుట్ వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ అద్భుతమైన నటి మరెవరో కాదు.. జరీన్ ఖాన్.

గోబ్లెట్ స్క్వాట్స్ అంటే..

జరీన్ ఖాన్ చేస్తున్న ఈ వ్యాయామాన్ని ‘గోబ్లెట్ స్క్వాట్స్’ అని పిలుస్తారు. ఇందులో బరువును గుండెకు దగ్గరగా పట్టుకుని కూర్చుని లేవాల్సి ఉంటుంది. ఇది కేవలం కాళ్లకే కాకుండా శరీరంలోని వివిధ కండరాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్వాడ్రిసెప్స్, గ్లూట్స్, హ్యామ్‌స్ట్రింగ్స్ వంటి కండరాలు బలోపేతం అవుతాయి. బరువును ఛాతీకి దగ్గరగా పట్టుకోవడం వల్ల శరీర భంగిమ మెరుగుపడటమే కాకుండా, వెన్నెముక నిటారుగా ఉంటుంది.

జరీన్ ఖాన్ చేస్తున్న ఈ భారీ వర్కవుట్ గురించి డైటీషియన్ గరిమా గోయల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 30 కిలోల బరువుతో స్క్వాట్స్ చేయడం అనేది అడ్వాన్స్‌డ్ స్ట్రెంత్ కండిషనింగ్‌కు నిదర్శనం అని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు ఇలాంటి వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు ఎంతో అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

ఆరోగ్య ప్రయోజనాలు..

  • వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల మహిళల్లో ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో వచ్చే కీళ్ల నొప్పులను నివారిస్తుంది.
  • కండరాల కదలిక వల్ల జీవక్రియ రేటు పెరిగి, కొవ్వు వేగంగా కరుగుతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది.
  • స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
  • కీళ్ల చుట్టూ ఉండే కండరాలు బలంగా మారడం వల్ల శరీరానికి మంచి స్థిరత్వం లభిస్తుంది.

జరీన్ ఖాన్ కేవలం తన అందంతోనే కాకుండా, తన శక్తితోనూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా సరైన శిక్షణతో ఇటువంటి కఠినమైన వ్యాయామాలు చేయవచ్చని ఆమె నిరూపిస్తోంది.

Follow Us