AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh: మొహం మీదే ఆ మాట అనేశాడు.. ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ హాట్ కామెంట్స్

హీరో అడివి శేస్ తన లేటెస్ట్ సినిమా డెకాయిట్ ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంటున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తు తన సినిమాను జనాల్లోకి తీసుకెళుతున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అడివి శేష్ ఒక స్టార్ హీరో గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Adivi Sesh: మొహం మీదే ఆ మాట అనేశాడు.. ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ హాట్ కామెంట్స్
Decoit Movie Hero Adivi Sesh
Basha Shek
|

Updated on: Apr 06, 2026 | 4:22 PM

Share

సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన హీరోల్లో అడివి శేష్ ఒకరు. మొదట్లో పలు సినిమాల్లో సహాయక నటుడిగా, విలన్‌గా మెప్పించిన అతను ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోగా రాణిస్తున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగానూ సత్తా చాటుతున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 సినిమాలతో హీరోగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న శేష్ ఇప్పుడు డెకాయిట్ తో మన ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ ప్రేమకథా చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్లలో బిజి బిజీగా ఉంటున్నాడు శేష్. ఇందులో భాగంగానే పలు టీవీ, యూట్యూబ్ ఛానెల్స్ కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. అయితే తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యుకు హాజరైన శేష్ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నాడు.

ఈ సందర్భంగా ఓ యంగ్ హీరో గురించి మాట్లాడిన అడివి శేష్.. ‘ఓ యాక్టర్‌ పేరు చెప్పను.. కానీ.. నా ప్రొడ్యూసర్ బర్త్‌ డే సందర్భంగా కలిశా. ‘నువ్వు ఎప్పుడూ ఇలాంటి చిన్న సినిమాలే చేస్తావా? నాలాంటి పెద్ద సినిమాలు ఎప్పుడు చేస్తావ్?” అని ఆ హీరో నేరుగా అడిగాడు.అతను చెప్పింది తెలుగులో చెబితే ఎవరో అర్థమైపోతుంది. అందుకే ఇంగ్లిష్‌ లో చెబుతున్నా. ఆయన మాటలకు నాకు చిరాకొచ్చింది. ‘నీ కుళ్లు బుద్ధి ఎప్పటికీ మారదు’ అని మనసులోనే అనుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు శేష్. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం శేష్ బయటపెట్టలేదు.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ 10న డెకాయిట్ గ్రాండ్ రిలీజ్..

ప్రస్తుతం డెకాయిట్ హీరో చేసిన కామెంట్స్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అడివి శేష్ తో అమర్యాదగా ప్రవర్తించిన ఆ హీరో ఎవరబ్బా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

డెకాయిట్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us