AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Rashmika Marriage: కన్నుల పండుగగా విజయ్‌ – రష్మిక పెళ్లి వేడుక.. దంపతులుగా మారిన చిరకాల ప్రేమికులు

అత్యంత ఆత్మీయుల మధ్య జరిగిన మూడు ముళ్ల వేడుక ఇవాళ ఉదయం 11.30దాకా సాగింది. పెళ్లి తంతు పూర్తవగానే ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమంటోస్‌ హోటల్‌ దగ్గరున్న మీడియాకు స్పెషల్‌ గా స్వీట్‌ బాక్సులు పంచి పెట్టింది విరోష్‌ పెళ్లి టీమ్‌. 2018లో మొదలైన పరిచయం.. 2019లో ప్రేమగా మారిన తరుణం.. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకరికోసం మరొకరు నిలుచుని ఒడుదొడుకులను ఎదుర్కొన్న వైనం..

Vijay Rashmika Marriage: కన్నుల పండుగగా విజయ్‌ - రష్మిక పెళ్లి వేడుక.. దంపతులుగా మారిన చిరకాల ప్రేమికులు
Vijay, Rashmika
Rajitha Chanti
|

Updated on: Feb 26, 2026 | 10:13 PM

Share

అప్పుడెప్పుడో గీత గోవిందం సినిమాలో కెమెరా ముందు… సినిమా కోసం జరిగిన సన్నివేశాలన్నీ, ఇప్పుడు విజయ్‌ దేవరకొండ – రష్మిక కళ్ల ముందు గిర్రున తిరుగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ, అగ్నిసాక్షిగా మూడు ముళ్లు పడ్డ తర్వాత ఏడడుగులు నడిచిన అనుభూతిని ఆస్వాదిస్తోందీ నవ జంట. అత్యంత ఆత్మీయుల మధ్య జరిగిన మూడు ముళ్ల వేడుక ఇవాళ ఉదయం 11.30దాకా సాగింది. పెళ్లి తంతు పూర్తవగానే ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమంటోస్‌ హోటల్‌ దగ్గరున్న మీడియాకు స్పెషల్‌ గా స్వీట్‌ బాక్సులు పంచి పెట్టింది విరోష్‌ పెళ్లి టీమ్‌. 2018లో మొదలైన పరిచయం.. 2019లో ప్రేమగా మారిన తరుణం.. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకరికోసం మరొకరు నిలుచుని ఒడుదొడుకులను ఎదుర్కొన్న వైనం.. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన శుభదినం అంటూ విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వేడుకకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి నెట్టింట్లో.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

మూడు రోజుల పెళ్లి.. 80ల్లో జరిగే పెళ్లిని తలపించే పెళ్లి…సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే, ఆధునికతను మేళవించిన పెళ్లి, హోలీ – హల్దీని కలగలిపిన పెళ్లి, ఆత్మీయుల ఆనందాలకు ఏమాత్రం లోటులేకుండా విందులూ, వినోదాలను ఏర్పాటు చేసిన పెళ్లి అంటూ అక్కడి విషయాలను విన్నవారు, బ్లర్డ్ ఫొటోల్లో చూసిన వారూ తోచినంత చెప్పుకుంటూనే ఉన్నారు. మూడు రోజులుగా ఆనందంగా సాగుతున్న వివాహ వేడుక ఈ రోజు సాయంత్రం కొడవ సంప్రదాయంలో జరిగే వివాహ తంతుతో పూర్తవుతుంది. అరటి బోదెలను నరుక్కుంటూ వరుడు వివాహ వేదికకు రావడం, అక్కడ తన కోసం ఎదురుచూస్తున్న వధువును మనువాడటం కొడవ సంప్రదాయంలో ప్రత్యేకత.

తెలుగు సంప్రదాయం ప్రకారం వైవాహిక తంతును పూర్తి చేసుకున్న నూతన వధూవరులు మరోసారి కొడవ తరహా పెళ్లి కోసం కలలు కంటున్నారు. ఓ వైపు జపనీస్‌ వంటలతోనూ, మరోవైపు అరిటాకు భోజనాలతోనూ కడుపు నిండిన అతిథులు.. సాయంత్రం కొడవ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిలో కొత్తజంటను కళ్లారా చూసి ఆనందించడానికి సిద్ధమవుతున్నారు. తెలుగు సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లిలో రష్మిక పట్టుచీర కట్టుకున్నారు. సాయంత్రం జరిగే పెళ్లిలో కొడవ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వస్త్రాలను ఎంపిక చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Follow Us