ఒంగోలు శివారులో గాడిద మాంసం పేరుతో గుర్రాలను వధించి మాంసం అమ్ముతున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మంగమూరు రోడ్డు వద్ద పక్కా సమాచారంతో పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.