AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manju Warrier: హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని.. నటి ఏం చేసిందో తెలుసా? వీడియో

ఈ మధ్యన సినిమా హీరోయిన్లు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అభిమానుల తాకిడిని తట్టుకోలేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ మధ్యన నిధి అగర్వాల్, సమంతలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురు కాగా ఇప్పుడు మరో హీరోయిన్ కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది.

Manju Warrier: హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని.. నటి ఏం చేసిందో తెలుసా? వీడియో
Actress Manju Warrier
Basha Shek
|

Updated on: Apr 06, 2026 | 5:06 PM

Share

మలయాళ స్టార్ హీరోయిన్‌ మంజు వారియర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని పాలక్కాడ్‌లో ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమెను ఓ మహిళా అభిమాని బలవంతంగా ముద్దు పెట్టుకుంది. ఉన్నట్లుండి ఇలా జరగడంతో హీరోయిన్ తో పాటు అక్కడున్న వారందరూ నిర్ఘాంతపోయారు. ఇక ఈ ఈవెంట్ యాంకర్ కూడా సదరు అభిమానిని గట్టిగా మందలించింది. మన దగ్గరకు వచ్చిన సినిమా సెలబ్రిటీలతో ఇలా ప్రవర్తించడం సరికాదని హెచ్చరించింది. అయితే సదరు మహిళ మాత్రం తను చేసిన పనిని సమర్థించుకుంది. ‘ నాకు మంజు అక్క అంటే చాలా ఇష్టం.. అందుకే ముద్దు పెట్టుకున్నా’ అని సమాధానమిచ్చింది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ మంజు వారియర్ మాత్రం ఏ మాత్రం కోపగించుకోలేదు. ఇది జరిగిన తర్వాత కూడా ఎంతో ఓపికగా, సహనంతో మిగతా అభిమానులతో సరదాగా మాట్లాడుతు ఫొటోలు, సెల్ఫీలు దిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మంజు వారియర్‌ విషయానికి వస్తే దక్షిణాదిలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో ఈ బ్యూటీ కూడా ఒకరు. మంజు కేవలం నటి మాత్రమే కాదు. డ్యాన్సర్‌, రైటర్‌, ప్రొడ్యూసర్‌, సోషల్‌ యాక్టివిస్ట్‌ కూడా! మలయాళం సినిమాలో స్టార్ నటిగా వెలుగొందుతోన్న ఆమె పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైంది. ముఖ్యంగా మంజు వారియర్ నటించిన అసురన్, తునివు (తెగింపు), వేట్టయాన్, ఎల్2: ఎంపురాన్ సినిమాలు తెలుగులోనూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కన్నెళుతి పొట్టుం తొట్టు చిత్రానికిగానూ జాతీయ అవార్డు పొందిన మంజు సల్లాపం అనే పుస్తకం రాసి తనలో రచయిత్రి కూడా దాగి ఉందని నిరూపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by Kunchacko Boban (@kunchacks)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?