AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Chitra : ఆ పాట ఎలా పాడానో ఇప్పటికీ అర్థం కాదు!.. సింగర్ చిత్ర కామెంట్స్..

దక్షిణాది చిత్ర పరిశ్రమలో 'గాన కోకిల', 'సంగీత సరస్వతి'గా పిలవబడే ప్రముఖ నేపథ్య గాయని కె.ఎస్. చిత్ర. దశాబ్దాలుగా తన అమృత గాత్రంతో కోట్లాది మంది శ్రోతలను అలరిస్తున్న ఆమె, భారతీయ చలనచిత్ర రంగంలోని అత్యుత్తమ గాయనీమణులలో ఒకరిగా నిలిచారు. చిత్ర 1963 జూలై 27న కేరళలోని తిరువనంతపురంలో ఒక సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే తండ్రి వద్ద సంగీత శిక్షణ పొందారు.

Singer Chitra : ఆ పాట ఎలా పాడానో ఇప్పటికీ అర్థం కాదు!.. సింగర్ చిత్ర కామెంట్స్..
Chitra
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2026 | 6:08 PM

Share

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తన మధురమైన గాత్రంతో కొన్ని దశాబ్దాలుగా శ్రోతలను అలరిస్తున్నారు సింగర్ కె.ఎస్. చిత్ర. ఆమె పాడిన ఎన్నో వేల పాటలు ఎప్పటికీ నిలిచిపోయే ఆల్‌టైమ్ హిట్స్‌గా నిలిచాయి. అయితే, ఇంతటి అనుభవం, ప్రతిభ ఉన్నప్పటికీ రికార్డింగ్ రూమ్‌లోకి వెళ్లేటప్పుడు ఇప్పటికీ తనలో ఒక తెలియని భయం, టెన్షన్ ఉంటాయని చిత్ర ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సాధారణంగా ఒక మంచి పాట పాడటానికి వెళ్తున్నప్పుడు గాయనీగాయకుల్లో ఎంతో ఉత్సాహం, సంతోషం ఉంటాయని అనుకుంటారు. కానీ చిత్ర మాత్రం దీనిపై భిన్నంగా స్పందించారు.

ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..

కొత్త రికార్డింగ్‌కు వెళ్లేటప్పుడు తనకు సంతోషం కంటే ఎక్కువగా టెన్షన్ వస్తుందని ఆమె చెప్పారు. “మనం రికార్డింగ్ థియేటర్‌కు వెళ్తున్నప్పుడు ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ ఎలాంటి పాట ఇస్తారో, అది నా గాత్రంలో సరిగ్గా కుదురుతుందా లేదా, వారిని నా పాటతో మెప్పించగలనా లేదా అనే ఒక పెద్ద బాధ్యత, భయం నా మనసులో ఎప్పుడూ ఉంటుంది” అని చిత్ర వివరించారు. చిత్ర తన కెరీర్‌లో దాదాపు అందరు అగ్ర కంపోజర్లతో పనిచేశారు. అయితే, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరకు వెళ్లేటప్పుడు మాత్రం తనకు ప్రత్యేకంగా ఆ భయం ఉంటుందని ఆమె ఒప్పుకున్నారు. వారిలో ఒకరు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా కాగా, మరొకరు ప్రముఖ కంపోజర్ శరత్. ముఖ్యంగా శరత్ మ్యూజిక్ కంపోజిషన్స్ చాలా క్లిష్టంగా ఉంటాయని ఆమె అన్నారు. ఆయన ఇచ్చే ట్యూన్స్, నోట్స్ అర్థం చేసుకోవడానికే ఒక్కోసారి గాయకులకు ఒక రోజంతా సమయం పడుతుందని చిత్ర నవ్వుతూ చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..

ఆ పాట నొటేషన్ రాస్తుంటే చాలా టెన్షన్ పడ్డాను:

శరత్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘సింధూర రేఖ’ అనే సినిమాలోని ఒక పాట అనుభవాన్ని చిత్ర ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రంలోని “ప్రణతోస్మి గురువాయుపురేశా..” అనే పాట ట్యూన్ విన్నప్పుడు తనకు అసలు బేసిక్ ‘సా’ (శృతి) ఎక్కడ ఉందో, నోట్స్ ఎటువైపు వెళ్తున్నాయో కూడా మొదట్లో అర్థం కాలేదన్నారు. ఆ క్లిష్టమైన క్లాసికల్ నోట్స్‌ను పేపర్‌పై నొటేషన్ (స్వరాలు) రాసుకుంటున్నప్పుడు తనకు చాలా టెన్షన్ పుట్టిందని, ఆ పాటను తాను ఇప్పటికీ ఎలా పాడగలిగానో తనకే అర్థం కాదని చిత్ర ఎంతో వినమ్రంగా చెప్పారు. ఎన్నో క్లిష్టమైన స్వరాలను అలవోకగా పాడే చిత్ర లాంటి గొప్ప గాయని కూడా ఓ ట్యూన్ కోసం అంతగా కష్టపడ్డారని తెలియడం సంగీత ప్రియులను ఆశ్చర్యపరుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..

Follow Us