AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: రష్మిక పక్కన ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కూతురు..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీప్రముఖులు, అభిమానులు విషెస్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కూతురు సైతం రష్మికతో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ?

Rashmika Mandanna: రష్మిక పక్కన ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కూతురు..
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Apr 06, 2026 | 4:11 PM

Share

పైన ఫోటోలో రష్మిక పక్కన ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? నిన్న నేషనల్ క్రష్ బర్త్ డే సందర్భంగా తనతో కలిసి దిగిన క్యూట్ మూమెంట్స్ సోషళ్ మీడియాలో పంచుకుంది. ఆ ఉంగరాల జుట్టు అమ్మాయి టాలీవుడ్ తోపు డైరెక్టర్ కూతురు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదండి డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూతురు వందన. ఇటీవలే ఆయన తెరకెక్కించిన కుబేర చిత్రంలో రష్మిక మందన్నా మెయిన్ లీడ్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఈవెంట్ లో రష్మికతో కలిసి సందడి చేసింది. ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉన్న వందన.. ఇటీవల కుబేర సినిమాకు రివ్యూ ఇవ్వడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఇప్పడిప్పుడే ఆమె బయట కనిపిస్తుంది. సినిమా ఈవెంట్లలో సందడి చేస్తుంది. ఎక్కువ మంది చదివినవి : Soundarya : ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయాను.. సౌందర్య గురించి ప్రేమ చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..

శేఖర్ కమ్ముల కూతురు వందన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇటీవల తన కూతురు గ్రాడ్యూయేషన్ ఫోటోస్ షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నాడు డైరెక్టర్. “మీ పిల్లలు పెరిగి పెద్దవారై, ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని మీరు గ్రహించినప్పుడు అది ఒక హృద్యమైన అనుభూతి. నా కూతురు గౌరవాలతో పట్టభద్రురాలు కావడం చూసి గర్వపడుతున్నాను.” అంటూ రాసుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 62 ఏళ్లలో 2500కు పైగా సినిమాలు.. మహేష్ బాబు సినిమాతో ఫేమస్.. ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇదిలా ఉంటే.. ఇటీవల డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా కీలకపాత్రలు పోషించారు. తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ.135.75 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..

ఎక్కువ మంది చదివినవి : Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. ఆ హీరో మాట్లాడే తీరు సూపర్ ఉంటుంది.. హీరోయిన్ ఆమని..

Follow Us