AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిన్ననే సెంచరీ కొట్టాడు.. అయినా టీమ్‌లోకి తీసుకోలేదు! ఇంతకంటే అన్యాయం ఉంటుందా?

భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు జట్టు ప్రకటనలో విరాట్ కోహ్లీ రీఎంట్రీతో అభిమానులు ఆనందించారు. అయితే, అద్భుత ఫామ్‌లో ఉన్న యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను పక్కనపెట్టడంపై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస సెంచరీలు చేసినా అతనికి చోటు దక్కకపోవడంపై సెలెక్టర్ల నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిన్ననే సెంచరీ కొట్టాడు.. అయినా టీమ్‌లోకి తీసుకోలేదు! ఇంతకంటే అన్యాయం ఉంటుందా?
Rohit And Jaiswal
SN Pasha
|

Updated on: Jun 21, 2026 | 3:09 PM

Share

వచ్చే నెల అంటే జూలైలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఆంగ్లేయుల గడ్డపై భారత్ అడుగుపెట్టనుంది. అయితే మూడు వన్డేల సిరీస్ కోసం తాజాగా బీసీసీఐ సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. ఇందులో విరాట్ కోహ్లీ పేరు కూడా ఉంది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌కు విరాట్ దూరమైన విషయం తెలిసిందే. తిరిగి ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌తో కోహ్లీ జట్టులోకి వస్తుండటంతో భారత క్రికెట్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. అంత వరకు బాగానే ఉన్నా.. ఓ ప్లేయర్ విషయంలో మాత్రం బీసీసీఐ సెలెక్టర్లు అన్యాయం చేశారంటూ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే.. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. టెస్టు టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఉన్న జైస్వాల్, వన్డే, టీ20 టీమ్స్‌లో ప్లేస్ కోసం పోరాడుతున్నాడు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో జైస్వాల్‌కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. వచ్చిన ఛాన్స్‌ను జైస్వాల్ అద్భుతంగా వినియోగించుకున్నాడు. తొలి వన్డేలో జైస్వాల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం దక్కలేదు. రెండో వన్డేలో కేవలం 4 పరుగులకే చేసి నిరాశపర్చినా.. మూడో వన్డేలో మాత్రం సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఇంగ్లాండ్ సిరీస్‌కు కూడా జైస్వాల్ ఎంపిక లాంఛనమే అనుకున్నారు. కానీ సెలెక్టర్లు సెంచరీ చేసిన నెక్ట్స్ డేనే ఊహించని షాక్ ఇచ్చారు.

జైస్వాల్ ఆడిన చివరి మూడు వన్డే ఇన్సింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేయడం విశేషం. అయినా కూడా జైస్వాల్‌ను సెలెక్టర్లు పక్కనపెట్టారు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో 116 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు, అలాగే ఆఫ్ఘాన్‌తో తాజాగా ఆడిన రెండు వన్డేల్లో 4, 110(నాటౌట్) పరుగులు చేశాడు. ఇంత అద్బుతంగా ఆడుతున్న జైస్వాల్‌కు వన్డే టీమ్‌లో చోటు ఇవ్వకపోవడం ఏంటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే టీమ్ కాంబినేషన్ కుదరకపోవడం వల్లే జైస్వాల్‌కు టీమ్‌లో చోటు దక్కడం లేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి రావడంతో వన్‌డౌన్‌ స్పాట్ ఫిక్స్ అయిపోయింది. దీంతో కెప్టెన్ గిల్, రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయాల్సిన పరిస్థితి. పోనీ గిల్ నాలుగు స్థానంలో రావొచ్చు అనుకుంటూ అక్కడ శ్రేయస్ అయ్యర్ ఉండనే ఉన్నాడు. రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరిలో ఎవరు లేకున్నా జైస్వాల్ కచ్చితంగా టీమ్‌లో ఉండేవాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏ పండ్లను కలిపి తినాలి? ఏవి వద్దు? అసలు ముచ్చట ఇదే..
ఏ పండ్లను కలిపి తినాలి? ఏవి వద్దు? అసలు ముచ్చట ఇదే..
గుండెల్ని పిండేసే ఘటన.. 4ఏళ్లకే నూరేళ్లు నిండిపోయినయా బిడ్డా..
గుండెల్ని పిండేసే ఘటన.. 4ఏళ్లకే నూరేళ్లు నిండిపోయినయా బిడ్డా..
వినాయకుడికి ఇష్టమైన పండుతో అమృతంలాంటి రోటి పచ్చడి
వినాయకుడికి ఇష్టమైన పండుతో అమృతంలాంటి రోటి పచ్చడి
తల లేని వినాయకుడు.. దేవభూమిలోని ఈ అద్భుత ఆలయం గురించి తెలిస్తే..
తల లేని వినాయకుడు.. దేవభూమిలోని ఈ అద్భుత ఆలయం గురించి తెలిస్తే..
కాళ్ళ వాపులతో ఇబ్బందా? ఇవి తింటే వృద్యాప్యంలో కూడా గుర్రంలా
కాళ్ళ వాపులతో ఇబ్బందా? ఇవి తింటే వృద్యాప్యంలో కూడా గుర్రంలా
ఒకవేళ వర్షం పడితే గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారో తెలుసా?
ఒకవేళ వర్షం పడితే గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారో తెలుసా?
గులాబీలు గుత్తులుగా పూయాలా? ఈ 6 నియమాలు పాటిస్తే పూల వర్షమే
గులాబీలు గుత్తులుగా పూయాలా? ఈ 6 నియమాలు పాటిస్తే పూల వర్షమే
ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు
ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణశాఖ అప్డేట్.. ఈ జిల్లాలకు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణశాఖ అప్డేట్.. ఈ జిల్లాలకు..
మీ కళ్లను కాపాడుకోవాలంటే వీటిని తినండి..
మీ కళ్లను కాపాడుకోవాలంటే వీటిని తినండి..