AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakib Al Hasan: ఇంటిపై పెట్రో బాంబు దాడి.. బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి షకీబ్ పెట్టిన షరతు ఇదే

Shakib Al Hasan: షకీబ్ అల్ హసన్ ఖాళీ ఇంటిపై దాడి కలకలం రేపింది. ఈ ఘటనపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్ స్టార్, ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తే స్వదేశానికి తిరిగి వస్తానని తెలిపారు. ఆరోపణలను ఎదుర్కొనేందుకు సిద్ధమని, ఫేర్‌వెల్ సిరీస్‌తో పాటు 2027 ప్రపంచకప్ ఆడాలనే లక్ష్యం ఉందని వెల్లడించారు.

Shakib Al Hasan: ఇంటిపై పెట్రో బాంబు దాడి.. బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి షకీబ్ పెట్టిన షరతు ఇదే
Shakib Al Hasan
Rakesh
|

Updated on: Aug 07, 2026 | 6:10 PM

Share

Shakib Al Hasan: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ పార్లమెంట్ సభ్యుడు షకీబ్ అల్ హసన్ నివాసంపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. బంగ్లాదేశ్‌లోని మగురా నగరంలో ఉన్న ఆయన ఖాళీ ఇంటిపై కొందరు నిరసనకారులు దాడి చేశారు. దాడి చేసేందుకు వచ్చిన వారు పెట్రోల్ బాటిళ్లతో వచ్చి ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఊహించని దాడి ఘటనపై షకీబ్ అల్ హసన్ తొలిసారిగా నోరు విప్పారు.

సమావేశంలో పాల్గొనడమే దాడికి కారణమా?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇటీవల నిర్వహించిన ఒక వర్చువల్ సమావేశంలో అవామీ లీగ్ పార్టీ తరఫున ఎంపీగా పనిచేసిన షకీబ్ అల్ హసన్ కూడా పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆయన ఎలాంటి ప్రసంగం చేయనప్పటికీ, ఈ సమావేశం ముగిసిన వెంటనే ఆయన ఇంటిపై దాడి జరిగింది. 2024లో బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థి ఉద్యమం, రాజకీయ అలజడుల నుంచి షకీబ్ బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లలేదు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో అమెరికాలో నివాసముంటూ, శ్రీలంకలో ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతున్నారు.

ప్రభుత్వానికి షకీబ్ షరతు

రాయిటర్స్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ.. “బంగ్లాదేశ్ ప్రభుత్వం నాకు పూర్తి భద్రత ఇస్తుందని హామీ ఇస్తే, నేను సంతోషంగా నా దేశానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాను. కోర్టులో నాపై ఉన్న ఆరోపణలను ఎదుర్కోవడానికి, అవసరమైన ప్రతి విచారణకు సహకరించడానికి నేను సిద్ధం. నేను ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు. మా నాయకురాలు (షేక్ హసీనా) చెప్పిన సూచనల ప్రకారమే మేము నడుచుకుంటాం. నేను ఎప్పుడూ శాంతిని, బంగ్లాదేశ్ అభివృద్ధిని మాత్రమే కోరుకున్నాను” అని స్పష్టం చేశారు.

ఫేర్‌వెల్ సిరీస్, 2027 వరల్డ్ కప్ లక్ష్యం

39 ఏళ్ల షకీబ్ అల్ హసన్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదు. స్వదేశంలో బంగ్లాదేశ్ జాతీయ జట్టు తరఫున ఒక ఫేర్‌వెల్ సిరీస్ ఆడి ఆటకు వీడ్కోలు చెప్పాలని ఆయన ఆశిస్తున్నారు. అంతేకాకుండా అంతా అనుకూలిస్తే 2027 వన్డే ప్రపంచ కప్‌లో కూడా బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించగలననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. డిసెంబరు నెలలో అవామీ లీగ్ నాయకులతో కలిసి స్వదేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి షకీబ్ పెట్టిన షరతు ఇదే
బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి షకీబ్ పెట్టిన షరతు ఇదే
అబ్బా.. ఏం ప్లానయ్యా.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్..
అబ్బా.. ఏం ప్లానయ్యా.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్..
నంది అభిషేకానికి ఇంతటి మహిమా! ఈ రోజును అస్సలు మిస్సవ్వకండి..
నంది అభిషేకానికి ఇంతటి మహిమా! ఈ రోజును అస్సలు మిస్సవ్వకండి..
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసింది..
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసింది..
'6 ఏళ్ల పిల్లాడు దేవుడు ఎవరనంటే ఏం చెప్తావ్‌?' UPSC టాపర్ ప్రశ్న
'6 ఏళ్ల పిల్లాడు దేవుడు ఎవరనంటే ఏం చెప్తావ్‌?' UPSC టాపర్ ప్రశ్న
లాల్ దర్వాజ మహంకాళి ఆలయం చరిత్ర తెలుసా? బోనాల వెనుక ఉన్న..
లాల్ దర్వాజ మహంకాళి ఆలయం చరిత్ర తెలుసా? బోనాల వెనుక ఉన్న..
సినిమాలో ఆ స్టార్ హీరోను ట్రోల్ చేయలేదు..
సినిమాలో ఆ స్టార్ హీరోను ట్రోల్ చేయలేదు..
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
ఇంట్లో పండగలు, శుభకార్యం తర్వాత మామిడి తోరణం ఎప్పుడు తీయాలి?..
ఇంట్లో పండగలు, శుభకార్యం తర్వాత మామిడి తోరణం ఎప్పుడు తీయాలి?..
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..
మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..
రామాయణం లో యశ్, రణబీర్‌ల పారితోషికం మైండ్‌ బ్లాంకే!
రామాయణం లో యశ్, రణబీర్‌ల పారితోషికం మైండ్‌ బ్లాంకే!
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఈ చిన్న ట్రిక్‌తో డబుల్ వడ్డీ!
సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఈ చిన్న ట్రిక్‌తో డబుల్ వడ్డీ!
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..