అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో వార్షికోత్సవ పనుల సందర్భంగా తీవ్ర ప్రమాదం జరిగింది. జెండా కర్రలు పాతే పనుల్లో ఎనిమిదో తరగతి విద్యార్థి చప్పిడి మణికంఠ కుడిచేతి మధ్య వేలు గునపం తగిలి తెగిపోయింది. అమలాపురంలోని ఆసుపత్రికి తరలించగా, సర్జరీ చేశారు. విద్యార్థులతో ప్రమాదకర పనులు చేయించడంపై ఉపాధ్యాయుల తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.