- Telugu News Photo Gallery You won't believe how many benefits of applying sambrani smoke on the head, Check Here is Details
Sambrani for Hair: తలకు సాంబ్రాణీ పొగ వేసుకోవడం వల్ల ఎన్ని లాభాలో నమ్మరు..
తలకు సాంబ్రాణీ పొగ వేయడం అనేది పూర్వం నుంచి కూడా ఉంది. కానీ ఈ రోజుల్లో ఎవరూ పెద్దగా తలకు సాంబ్రాణీ వేయడం లేదు. సాంబ్రాణీ పొగ వేయడం వల్ల కేవలం జుట్టుకు మాత్రమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..
Updated on: Jan 06, 2025 | 9:48 PM

ఈ రోజుల్లో అయితే ఎవ్వరూ పాత పద్దతుల్ని ఫాలో చేయడం లేదు. పూర్వ కాల పద్దతుల వలన ఎన్నో ఆరోగ్య లాభాలు ఉండేవి. వాటిల్లో జుట్టుకు సాంబ్రాణీ పొగ వేయడం కూడా ఒకటి. ఇప్పుడు తల స్నానం చేశామా.. హెయిర్ డ్రెయిర్‌తో ఆరబెట్టుకున్నామా అని మాత్రమే ఆలోచిస్తున్నారు.

అప్పటి రోజుల్లో అయితే తల అంటితే ఖచ్చితంగా తలకు సాంబ్రాణీ వేయాల్సిందే. ఇలా తలకు సాంబ్రాణీ వేయడం వల్ల కేవలం జుట్టుకు మాత్రమే కాదు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..

చిన్న పిల్లలకు కూడా తల స్నానం చేయిస్తే సాంబ్రాణీ పొగ వేసేవారు. ఈ పొగ వేసుకోవడం వల్ల నెత్తి మీద తేమ అనేది త్వరగా ఆరిపోతుంది. జుట్టు నుంచి మంచి సువాసన కూడా వస్తుంది. ఎలాంటి కీటకాలు ఉన్నా నశిస్తాయి. జుట్టు నెరసిపోకుండా నల్లగా మారుతుంది.

ఈ పొగను పీల్చడం వల్ల ఆడవారికి గర్భాశయ సమస్యలు ఏమన్నా ఉంటే కంట్రోల్ అవుతాయి. ఎటువంటి అంటు వ్యాధులైనా సరే త్వరగా రాకుండా ఉంటాయి. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు త్వరగా రాకుండా ఉంటాయి.

క్యాన్సర్ కూడా నయం చేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వాపులు వంటి సమస్యలు ఉన్నా తగ్గుతాయి. ఒళ్లు నొప్పులు కూడా కంట్రోల్ అవుతాయి. తలనొప్పి తగ్గి చక్కగా నిద్ర పడుతుంది. ఒత్తిడి వంటివి కూడా తగ్గుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




