Makeup Tips: చలికాలంలో మేకప్ వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేయకండి..! పర్‌ఫెక్ట్ లుక్ రానేరాదు
చలికాలంలో అందాన్ని కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారుతుంది. ఆహారం నుంచి వేసుకునే మేకప్ వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చర్మం నిర్జీవంగా మారి అందవిహీనంగా మారుతుంది. ముఖ్యంగా ముఖానికి మేకప్ వేసుకునే టప్పుడు చలికాలంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jan 07, 2025 | 11:31 AM

అమ్మాయిలు అందం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారన్న సంగతి తెలిసిందే. ఇక పండుగలు, శుభకార్యాల్లో అమ్మాయిలు మేకప్ లేకుండా బయటకు అస్సలురారు. అందంగా కనిపించాలని రకరకాల మేకప్‌లను ప్రయత్నిస్తుంటారు. అయితే సహజంగా, అందంగా కనిపించాలంటే కొన్ని టిప్స్ చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మేకప్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. సహజమైన మేకప్ కోసం ముఖాన్ని శుభ్రపరచడం, మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు. మేకప్ ఎక్కువసేపు ఉండేందుకు ప్రైమర్ సహాయపడుతుంది. సహజమైన మేకప్ లుక్ కోసం మాయిశ్చరైజర్ తర్వాత ప్రైమర్‌ని అప్లై చేయాలి. ఇది చర్మాన్ని మృదువుగా చేసి మేకప్ లుక్‌ని రెట్టింపు చేస్తుంది.

పై దశలను పూర్తి చేసిన తర్వాత, సెట్టింగ్ పౌడర్‌తో ముఖాన్ని సెట్ చేయాలి. పౌడర్‌ను మొత్తం ముఖమంతా సమానంగా అప్లై చేసి సెట్ చేయడం చాలా ముఖ్యం. సెట్టింగ్ కాస్త డిఫరెంట్ గా ఉన్నా మేకప్ పర్ఫెక్ట్ గా రాదు.

కొంతమంది బ్రష్ లతో ముఖంపై ఫౌండేషన్ అప్లై చేస్తుంటారు. అయితే ఈ సీజన్‌లో స్పాంజ్‌లను వాడటం మంచిది. స్పాంజ్‌లను తడిపి, ఫౌండేషన్‌ను ముంచి ముఖంపై అప్లై చేయాలి. ఇది మృదువైన మేకప్ ఇస్తుంది.

చలికాలంలో పెదవులు పగిలిపోయి, ఎండిపోతాయి. ఈ సీజన్‌లో పెదవులు నిర్జీవంగా మారి అందాన్ని కోల్పోతాయి. మేకప్ వేసుకునేటప్పుడు లిప్ బామ్ వాడటం మంచిది. ఇది పెదాలను తేమగా, ఆకర్షణీయంగా ఉంచుతుంది. కాబట్టి నాణ్యమైన లిప్ బామ్ వాడాలి. అలాగే కంటికి కూడా మేకప్ వేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.




