- Telugu News Photo Gallery Incredible Health Benefits Of Drinking Milk With Jaggery Before Bedtime In Telugu Lifestyle News
రాత్రిపడుకునే ముందు పాలల్లో బెల్లం వేసుకొని తాగితే ఏమవుతుందో తెలుసా..?
రాత్రిపూట పడుకునే ముందు చాలా మందికి పాలు తాగే అలవాటు ఉంటుంది. అలా వేడి వేడి పాలు తాగడం వల్ల హాయిగా నిద్రపడుతుందని వైద్య ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు గ్లాసుడు పాలు తాగితే.. కలిగే ప్రశాంతత అంతా ఇంతా కాదు. అదే పాలల్లో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని తాగితే రెట్టింపు ప్రయోజనం అంటున్నారు. ఆయా లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jan 07, 2025 | 7:04 AM

పాలల్లో ట్రిస్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది.. ప్రశాంతంగా నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది. ఇలా... పాలల్లో బెల్లం వేసుకోవడం వల్ల రుచికి తియ్యగా ఉండటంతో పాటు.. పోషక విలువలను కూడా పెంచుతుంది. అందుకే రోజూ రాత్రి పడుకునే ముందు పాలలో బెల్లం కలిపి తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి పడుకునే ముందు బెల్లం పాలను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, పాలలోని కాల్షియం వల్ల రాత్రిపూట దీనిని తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. బెల్లం కాలేయంలోని మలినాను శుద్ది చేస్తుంది. రాత్రి పూట బెల్లం పాలు తాగితే ఉదయానికి శరీరంలోని మలినాలు తొలగిపోతాయి.

పాలలో ఉండే కాల్షియం కండరాల నొప్పులను తగ్గిస్తుంది. బెల్లంలోని ఐరన్ రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని పాలలో బెల్లం కలిపి తాగడం వల్ల పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. రోజూ పాలలో బెల్లం కలిపి తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బెల్లం డిజైన్ చూస్తే అది అసలైనదో నకిలీదో తెలుస్తుంది. స్వచ్ఛమైన బెల్లం తేలికగా, మెత్తగా, కొద్దిగా జిగటగా ఉంటుంది. ఈ బెల్లం సులభంగా పగలవచ్చు. కానీ కల్తీ బెల్లం మరీ గట్టిగా ఉంటుంది. పగలగొట్టడం చాలా కష్టం.

బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, పాలలోని పోషకాల వల్ల రాత్రిపూట తాగితే చర్మం కాంతివంతమవుతుంది. రాత్రిపూట పడుకునే ముందు బెల్లం పాలను తాగితే మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీనిని పాలతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది.




