Banana Flower: ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు.. వారానికోసారి తినండి చాలు.. శరీరంలో మ్యాజిక్ చూడండి

అరటి పండు మాత్రమే కాదు.. అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అరటి పువ్వులో శరీరానికి కావాల్సిన మూలకాలు ఫైబర్‌, ప్రొటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఇ, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు మంచి మొత్తంలో ఉంటాయి. ఈ కారణంగా అరటి పువ్వు అనేక వ్యాధులతో పోరాడటానికి ఉపయోగపడుతుంది. అరటి పువ్వు ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Jan 07, 2025 | 10:46 AM

అరటి పువ్వులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ప్రోస్టేట్ గ్రంధి పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని సిట్రిక్ యాసిడ్, అమినో యాసిడ్స్ ప్రోస్టేట్ గ్రంధిని సాధారణ పరిమాణానికి తీసుకువస్తాయి. అరటి పువ్వు నెఫ్రో ప్రొటెక్టివ్ యాక్టివిటీని కలిగి ఉంది. ఇది కిడ్నీ దెబ్బతినకుండా కాపాడుతుంది.

1 / 6
అరటి పువ్వులు ఫైబర్‌ అధికంగా ఉండి, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. అరటి పువ్వు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే లక్షణాలను కలిగి ఉంది. ఇది నెమ్మదిగా శరీరంలోకి గ్లూకోజ్‌ని విడుదల చేస్తుంది. అదనంగా, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.

2 / 6
అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి అరటి అద్బుత మేలు చేస్తుంది. అరటి పువ్వును ఆహారంలో భాగంగా చేసుకుంటే.. యాంటీ హైపర్‌టెన్సివ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించగలదు. ఇందులో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, అనేక పోషకాలు అనేక ఇతర వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తాయి.

3 / 6
అరటి పువ్వులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తం లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా రక్తహీనతతో బాధపడేవారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇందులో ఉండే జింక్ ఎముకల నష్టాన్ని నివారిస్తుంది. ఇందులో క్వెర్సెటిన్, కాటెచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఎముకల నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి.

4 / 6
అరటి పువ్వుతో చర్మ సమస్యలకు కూడా చెక్‌ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. ఇది యాంటీ హిస్టామైన్‌ లక్షణాలు కలిగి ఉండటం వల్ల అలెర్జీలు తగ్గించడంలో సహాయపడుతుంది. అరటి పువ్వులో తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

5 / 6
అరటి పువ్వులోని టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, ఆక్సీకరణ నష్టాన్ని తొలగిస్తాయి. తద్వారా గుండె రోగులలో అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

6 / 6
Follow us