- Telugu News Photo Gallery Cricket photos WTC 2025 Scenarios, Sri Lanka should do this to enter Final instead of Australia
WTC Final: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్.. సౌతాఫ్రికాను ఢీ కొట్టేది ఎవరంటే?
WTC 2025 Final: ఐసీసీ నిబంధనల ప్రకారం, టెస్ట్ క్రికెట్‌లో 15 ఓవర్లు గంటలోపు వేయాల్సిందే. గాయం లేదా ఇతర కారణాలతో కాకుండా పదిహేను ఓవర్లు బౌలింగ్ చేయకుంటే పెనాల్టీ పడుతుంది. అలాగే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాయింట్లలోనూ కోత పడనుంది. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో ఇలాంటి అద్భుతం జరిగితే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరుకోవచ్చు.
Updated on: Jan 07, 2025 | 11:30 AM

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడడం ఖాయం. ఇది ఖాయమైనప్పటికీ శ్రీలంక జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించే అవకాశం ఏమాత్రం కొట్టిపారేయంలే. అయితే, ఈ అవకాశాన్ని కల్పించాల్సింది మాత్రం ఆస్ట్రేలియా టీం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు ఆస్ట్రేలియా భారీ తప్పిదం చేయక తప్పదు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా 69.44% మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 63.73%తో రెండో స్థానంలో ఉంది. దీంతో ఇరు జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. అయితే, ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సిరీస్ మ్యాచ్ లు ఇక్కడితో ముగియకపోవడం విశేషం.

అంటే, ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. శ్రీలంక 2-0తో సిరీస్ గెలిస్తే ఆస్ట్రేలియా స్కోరు 57.02 శాతానికి పడిపోతుంది. దీంతో లంక జట్టు ఫైనల్‌కు అర్హత సాధించదు. అలా కాకుండా ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆస్ట్రేలియా జట్టు పెద్ద పొరపాటు చేయాల్సి ఉంటుంది.

స్లో ఓవర్ రేట్. శ్రీలంకతో జరిగే 2 టెస్టు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్ మిస్టేక్ చేస్తే ఆస్ట్రేలియా కనీసం 8 పాయింట్లు కోల్పోవడం ఖాయం. దీంతో ఆస్ట్రేలియా జట్టు పర్సంటేజీ పాయింట్లలో మార్పు రానుంది. అంటే, ఆస్ట్రేలియా జట్టు 2-0 తేడాతో సిరీస్‌ను కోల్పోయి రెండు స్లో ఓవర్ రేట్ తప్పిదాలు చేస్తే, శ్రీలంక ఆస్ట్రేలియా జట్టును అధిగమించి ఫైనల్‌కు అర్హత పొందవచ్చు.

టెస్టు క్రికెట్‌లో ఇలాంటి పొరపాట్లు జరిగాయా అని ఆరాతీస్తే.. కచ్చితంగా ఎస్ అనే అన్సర్ వస్తుంది. 2023లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ మొత్తం 19 పాయింట్లు కోల్పోయింది. ఈ కారణంగా, 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరే అవకాశాన్ని ఇంగ్లండ్ కోల్పోయింది. అలాగే, స్లో ఓవర్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా జట్టు 10 పాయింట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అలా అదృష్టం చేతికి వస్తే శ్రీలంక జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించవచ్చు.




