Sanju Samson Top t20i Run Scorer: 2024లో టెస్ట్ ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు దిగజారిపోయింది. అయితే, టీ20 ప్రపంచకప్ గెలిచి ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చుకుంది. ఈ క్రమంలో సంజు శాంసన్ టీ20 ఫార్మాట్‌లో పరుగుల వర్షం కురిపించాడు. కాగా, భారత్ ప్రపంచకప్ గెలిచిన ఏడాదిలోనే సంజూ ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. సంజూ 13 మ్యాచ్‌ల్లో 43.60 సగటుతో 436 పరుగులు చేశాడు.