- Telugu News Photo Gallery Cricket photos Yashasvi Jaiswal may likely to selected in Team India's odi Squad for England
Team India: టీ20ల్లో హిట్.. టెస్ట్‌ల్లో సూపర్ హిట్.. కట్‌చేస్తే.. వన్డేల్లో అరంగేట్రానికి సిద్ధం..
Yashasvi Jaiswal: ఈ బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో 23 ఏళ్ల యువ పేసర్ యశస్వి జైస్వాల్ టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైస్వాల్ 10 ఇన్నింగ్స్‌ల్లో 1 సెంచరీ, 2 అర్ధసెంచరీలతో మొత్తం 391 పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన తర్వాత జైస్వాల్ మరో ఫార్మాట్‌లో ఆడే ఛాన్స్ ఉంది.
Updated on: Jan 08, 2025 | 7:50 AM

Yashasvi Jaiswal: టీమిండియా ప్రస్తుత సక్సెస్ ఫుల్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ యశస్వి జైస్వాల్ ఇప్పటికే టీ20, టెస్టు జట్లలో భారత్ తరపున ఆడాడు. ఈ రెండు ఫార్మాట్లలో రాణించినా ఒక్క వన్డే ఫార్మాట్‌లో మాత్రం జైస్వాల్‌కు ఇంతవరకు ఛాన్స్ రాలేదు.

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు యశస్వి జైస్వాల్‌ను వన్డే జట్టుకు ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. దీని ప్రకారం, ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో జైస్వాల్ దాదాపుగా బరిలోకి దిగడం ఖాయం.

ఇక్కడ అదనపు ఓపెనర్‌గా జైస్వాల్ జైస్వాల్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఎందుకంటే, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ వన్డే మ్యాచ్‌ల్లో టీమిండియాకు ఓపెనర్లుగా ఆడుతున్నారు. జైస్వాల్ ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు మూడో ఓపెనర్‌గా ఎంపికయ్యాడు.

ఇప్పటికే టీ20 క్రికెట్‌ను ప్రారంభించి 22 ఇన్నింగ్స్‌లలో 723 పరుగులు చేశాడు. అలాగే టెస్టులో 36 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్‌గా కనిపించిన జైస్వాల్ 2 డబుల్ సెంచరీలు, 4 సెంచరీలతో మొత్తం 1798 పరుగులు చేశాడు.

ఇప్పుడు వన్డే జట్టులోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన జైస్వాల్‌కు ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో అవకాశం ఇస్తారా అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే, ఈ యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో నేర్పరి. కాబట్టి, అతను ఓపెనర్‌గా ఫీల్డ్‌లో రాణిస్తే, రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా లెఫ్ట్ హ్యాండర్-రైట్ హ్యాండర్ ఓపెనింగ్ జోడీతో బరిలోకి దిగవచ్చు.




