- Telugu News Photo Gallery Cricket photos Indian Pace bolwer Jasprit Bumrah nominated for ICC Player of the Month
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ముగ్గురు పేసర్లు.. లిస్ట్‌లో టీమిండియా ఖతర్నాక్ ప్లేయర్
ICC Player Of The Month: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రతి నెలా అత్యుత్తమ ప్రదర్శన చేసే ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందజేస్తుంది. ఈసారి ఈ అవార్డు జాబితాలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నాడు. అతనితోపాటు ఇద్దరు ముఖ్యమైన బౌలర్లు కూడా ఈ అవార్డు రేసులో ఉన్నారు.
Updated on: Jan 08, 2025 | 10:55 AM

ICC Player of the Month: డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ఆటగాళ్ల నామినీల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా పేసర్ డేన్ ప్యాటర్సన్ ఉన్నారు.

జస్ప్రీత్ బుమ్రా: డిసెంబర్ నెలలో బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ఆడిన జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ సిరీస్‌లో బుమ్రా అడిలైడ్‌లో 61 పరుగులకు 4 వికెట్లు పడగొట్టగా, బ్రిస్బేన్‌లో 76 పరుగులకు 6 వికెట్లు, మెల్‌బోర్న్‌లో 9 వికెట్లు తీసుకున్నాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన ఫలితంగా, అతను ఇప్పుడు డిసెంబర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ జాబితాకు నామినేట్ అయ్యాడు.

పాట్ కమిన్స్: ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ డిసెంబర్ నెలలో టీమ్ ఇండియాతో బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ ఆడాడు. ఈసారి బ్యాటింగ్ ద్వారా 144 పరుగులు చేస్తే.. బౌలింగ్ లో 17 వికెట్లు పడగొట్టి రాణించాడు. తద్వారా గత నెల ఆటగాళ్ల జాబితాలో కమిన్స్ కూడా చోటు దక్కించుకున్నాడు.

డేన్ ప్యాటర్సన్: దక్షిణాఫ్రికా పేసర్ డేన్ ప్యాటర్సన్ డిసెంబర్‌లో శ్రీలంక, పాకిస్థాన్‌లతో టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈసారి 13 వికెట్లు పడగొట్టి, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ విధంగా డేన్ ప్యాటర్సన్ కూడా డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నామినేట్ అయ్యాడు.

ఈ ముగ్గురు ఆటగాళ్లలో ఒకరు డిసెంబర్ నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకుంటారు. ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరో నిర్ణయించడానికి మీరు కూడా ఓటు వేయవచ్చు. www.icc-cricket.com/awards వెబ్‌సైట్‌కి వెళ్లి మీకు ఇష్టమైన ఆటగాళ్లకు ఓటు వేయండి.




