AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Canara Bank Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీ అర్హతతో కెనరా బ్యాంకులో ఉద్యోగాలు

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. డిగ్రీ అర్హతతో వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి బెంగళూరులోని కెనడా బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా జనవరి 24వ తేదీ వరకు దరఖాస్తులు కొనసాగనున్నాయి. పోస్టుల వివరాలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..

Canara Bank Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీ అర్హతతో కెనరా బ్యాంకులో ఉద్యోగాలు
Canara Bank Jobs
Srilakshmi C
|

Updated on: Jan 07, 2025 | 11:18 AM

Share

బెంగళూరులోని కెనరా బ్యాంక్‌లోని హ్యూమన్ రిసోర్సెస్ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న పలు కెనరా బ్యాంకు బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతూ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 60 పోస్టులను (ఐటీ) ఏపీఐ మేనేజ్‌మెంట్, (ఐటీ) డేటాబెస్‌/ పీఎల్ ఎస్‌క్యూఎల్‌, క్లౌడ్‌ సెక్యూరిటీ, డేటా, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఖాళీల వివరాలు ఇలా..

  • అప్లిక్లేషన్‌ డెవలపర్స్‌ పోస్టుల సంఖ్య: 07
  • క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల సంఖ్య: 02
  • అనలిస్ట్‌ పోస్టుల సంఖ్య: 08
  • డేటా బెస్‌ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల సంఖ్య: 09
  • డేటా ఇంజినీర్ పోస్టుల సంఖ్య: 02
  • డేటా మైనింగ్‌ ఎక్స్‌పర్ట్ పోస్టుల సంఖ్య: 02
  • డేటా సైంటిస్ట్‌ పోస్టుల సంఖ్య: 02
  • ఎథికల్‌ హ్యాకర్‌ అండ్‌ పెనెట్రేషన్‌ టెస్టర్‌ పోస్టుల సంఖ్య: 01
  • ఈటీఎల్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల సంఖ్య: 02
  • జీఆర్‌సీ అనలిస్ట్ – ఐటీ గవర్నెన్స్, ఐటీ రిస్క్ అండ్‌ కంప్లయన్స్ పోస్టుల సంఖ్య: 01
  • నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల సంఖ్య: 06
  • ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 07
  • ఫ్లాట్‌ఫామ్‌ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల సంఖ్య: 01
  • ప్రైవేట్ క్లౌడ్‌ అండ్‌ వీఎంవేర్‌ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల సంఖ్య: 01
  • సొల్యూషన్ ఆర్కిటెక్ట్ పోస్టుల సంఖ్య: 01
  • సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల సంఖ్య: 08

ఈ పోస్టులకు దరకాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ బీఈ/బీటెక్‌, బీసీఏ/ఎంసీఏ/ ఎంఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారుమ జనవరి 24, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ. 18 లక్షల నుంచి రూ. 27 లక్షల ప్యాకేజీ అందజేస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే
మహారాష్ట్రలో బ్యాన్‌ చేసిన ఈ అనలాగ్ పనీర్‌ గురించి తెలుసా!
మహారాష్ట్రలో బ్యాన్‌ చేసిన ఈ అనలాగ్ పనీర్‌ గురించి తెలుసా!
బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్‌.. మైలేజ్, ధర వివరాలు
బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్‌.. మైలేజ్, ధర వివరాలు