Fashion World: ఇలాంటి షూ ధరిస్తే మీ టేస్ట్ వరస్టే.. అబ్బాయిలూ కాస్త ఫ్యాషన్‌ పాఠాలు నేర్చుకోండి!

కొంత మంది అబ్బాయిలకు కాస్త కూడా డ్రెస్ సెన్స్ ఉండదు. ఏ బట్టలు వేసుకుంటారో.. వాటిపై ఎలాంటి షూ ధరిస్తారో.. చూసుకోకుండానే అన్ని చోట్లకు వెళ్తుంటారు. ఇలా వెళ్లడం వల్ల మీకు సరైన మర్యాద దక్కకపోగా.. ఎవ్వరూ మిమ్మల్ని కేర్ చేయరు. ఇలాకాకుండా అందరి చూపూ మీపై నిలపాలంటే ఈ కింది చిన్నపాటి టిప్స్ ఫాలో అయితే సరి..

Fashion World: ఇలాంటి షూ ధరిస్తే మీ టేస్ట్ వరస్టే.. అబ్బాయిలూ కాస్త ఫ్యాషన్‌ పాఠాలు నేర్చుకోండి!
Fashion World
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 06, 2025 | 8:47 PM

నేటి ఫ్యాషన్ ప్రపంచంలో కాలంతో పాటు ప్రతిదీ మారుతుంది. మార్కెల్‌లో సందడి చేస్తున్న రకరకాల స్టైలిష్‌ దుస్తులతో పాటు వాటికి సరిగ్గా మ్యాచ్‌ అయ్యే షూస్ ధరించాలి. అప్పులు లుక్‌ అదిరిపోతుంది. ముఖ్యంగా మగవాళ్లకు ఇలాంటి చిన్న చిన్న మార్పులు కొత్త లుక్‌ ఇస్తాయి. కొంతమంది అన్ని రకాల దుస్తులకు ఒకే జత బూట్లు ధరిస్తారు. మ్యాచింగ్ షూస్ వేసుకోకుంటే ఎంత మంచి డ్రెస్‌ వేసుకున్నా లుక్‌ మారిపోతుంది. డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన ఖరీదైన దుస్తులకు విలువ లేకుండా పోతుంది. అందుకే ధరించే దుస్తులను బట్టి షూస్ ఎంచుకోవడం చాలా ముఖ్యం.

ఫార్మల్స్ కోసం ఇలాంటి షూస్ ధరించాలి

మీరు ఆఫీసుకి ఫార్మల్ డ్రెస్ వేసుకుని వెళుతుంటే, స్టైలిష్ షూస్ వేసుకోకండి. మీరు ఫార్మల్ దుస్తులను ధరిస్తే, ఫార్మల్ బూట్లు ధరించడం మంచిది. లేదంటే ఈ దుస్తుల రూపురేఖలే మారిపోతాయి. ఈ ఫార్మల్ డ్రెస్ కోసం బ్లాక్ అండ్ బ్రౌన్ షూస్ ఎంచుకుంటే మంచిది.

బ్లాక్ కలర్ షూ ఏ దుస్తులతో బాగుంటుందంటే..

చాలా మంది అన్ని బ్లాక్ కలర్ షూలను ఇష్టపడతారు. ఈ నల్లటి బూట్లు ఏ దుస్తులకైనా సరిపోతాయి. ఫార్మల్ వేర్లకు ఈ బ్లాక్ కలర్ షూ బాగా మ్యాచ్ అవుతుంది.

ఈ రకమైన దుస్తులతో బ్రౌన్ బూట్లు ధరించాలి

ఈ రోజుల్లో బ్రౌన్ షూస్ ఎక్కువగా బ్లాక్ షూస్‌తో పాటు కొనుగోలు చేస్తున్నారు. ఈ షూ నిజంగా స్టైలిష్ లుక్ ఇస్తాయి. జీన్స్ ప్యాంట్లు, ఫార్మల్స్ ప్యాంట్లు వేసుకుంటే బ్రౌన్ షూస్ మ్యాచ్ అవుతాయి. ఇందులో మీరు స్టైలిష్‌గా కూడా కనిపిస్తారు.

జీన్స్‌ ధరించే ఎలాంటి షూని ఎంచుకోవాలంటే

స్టైలిష్ షూ ఏవైనా జీన్స్‌తో బాగా సరిపోతాయి. జీన్స్ ప్యాంట్‌లకు లేస్‌ లెస్ బూట్లు, లోఫర్‌లు మంచి ఎంపిక. ఇది మిమ్మల్ని ఆకర్షణీయంగా మారుస్తుంది. అయితే నేటి అబ్బాయిలు జీన్స్‌ డ్రెస్ కు కూడా బ్రౌన్ షూస్‌ని ఎంచుకుంటున్నారు.

మల్టీ, డార్క్ కలర్ షూలను ఎంపిక చేసుకోవాలంటే

నలుపు, గ్రే, వైట్ కలర్ షూస్ మాత్రమే కాదు.. డార్క్, మల్టీ కలర్ షూస్ కూడా నేటి రోజుల్లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. మీరు ఏదైనా పార్టీకి వెళుతున్నట్లయితే, ఈ రకమైన షూలను ఎంచుకోవడం మంచిది. ఇవి అందరినీ ఆకర్షిస్తాయి. చిన్న పిల్లల నుంచి యువకుల వరకు ఈ బూట్లు కొత్త లుక్‌ ఇవ్వడమే కాకుండా ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి.

మరిన్ని జీవనశైలి వార్తల కోసం క్లిక్‌ చేయండి.