Sweet Corn Rice: సింపుల్‌గా ఇలా స్వీట్ కార్న్ రైస్ చేయండి.. పిల్లలు ఇష్టపడి తింటారు..

స్వీట్ కార్న్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. స్వీట్ కార్న్‌లో కూడా మంచి పోషకాలు లభిస్తాయి. పిల్లలకు కూడా స్వీట్ కార్న్ చాలా ఇష్టం. ఎందుకంటే ఇది తియ్యగా ఉంటుంది. మరి ఇలాంటి దానితో రైస్ చేస్తే.. పిల్లలు కూడా ఇష్టపడి మరీ తింటారు. ఈ రైస్ చేయడం కూడా చాలా సింపుల్. ఇది పిల్లలకు బెస్ట్ రెసిపీగా చెప్పొచ్చు..

Sweet Corn Rice: సింపుల్‌గా ఇలా స్వీట్ కార్న్ రైస్ చేయండి.. పిల్లలు ఇష్టపడి తింటారు..
Sweet Corn Rice
Follow us
Chinni Enni

|

Updated on: Jan 06, 2025 | 8:32 PM

స్వీట్ కార్న్ అంటే చాలా మందికి ఇష్టం. స్వీట్ కార్న్‌తో చేసే క్రిస్పీ స్వీట్ కార్న్ స్టాటర్ చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. స్వీట్ కార్న్‌లో కూడా మంచి పోషకాలు లభిస్తాయి. పిల్లలకు కూడా స్వీట్ కార్న్ చాలా ఇష్టం. ఎందుకంటే ఇది తియ్యగా ఉంటుంది. మరి ఇలాంటి దానితో రైస్ చేస్తే.. పిల్లలు కూడా ఇష్టపడి మరీ తింటారు. ఈ రైస్ చేయడం కూడా చాలా సింపుల్. ఇది పిల్లలకు బెస్ట్ రెసిపీగా చెప్పొచ్చు. రెండు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు కూడా పెట్టొచ్చు. మరి ఈ స్వీట్ కార్న్ రైస్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడే చూసేయండి.

స్వీట్ కార్న్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు:

స్వీట్ కార్న్, ఉడికించిన అన్నం, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చి మిర్చి, జీలకర్ర, ఆయిల్ లేదా నెయ్యి.

ఇవి కూడా చదవండి

స్వీట్ కార్న్ రైస్‌ తయారీ విధానం:

ఈ రెసిపీ చేయడం చాలా సింపుల్. ముందుగా స్వీట్ కార్న, అన్నం విడి విడిగా ఉడికించి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. ఆ తర్వాత కరివేపాకు, జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఆ నెక్ట్స్ పచ్చి మిర్చి, ఉల్లిపాయలు వేసి కాస్త కలర్ మారేంత వరకు వేయించండి. ఆ తర్వాత స్వీట్ కార్న, ఉప్పు, కొద్దిగా కారం, పసుపు, కొత్తిమీర వేసి అన్నీ ఓ నిమిషం పాటు ఫ్రై చేయండి. ఆ తర్వాత రైస్ వేసి మొత్తం అంతా కలిసేలా కలపండి. పిల్లలకు అయితే పచ్చి మిర్చిని వేయడం వదిలేయండి. అంతే ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ రైస్ సిద్ధం. ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు చాలా ఈజీగా చేసే రెసిపీ. లంచ్ బాక్సుల్లో చాలా త్వరగా అయిపోతుంది. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.