HMPV Cases: వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులు గుర్తింపు.. ముంబైలో ఆరు నెల పాపకి పాజిటివ్..

Hyderabad HMPV Cases: కరోనా సృష్టించిన విలయతాండవం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం బయట పడుతోన్న వేళ.. చైనాలో మరో వైరస్ విలయతండంవం సృష్టిస్తోంది. అంతేకాదు HMPV వైరస్ మన దేశంలో కూడా అడుగు పెట్టింది. ఇప్పటికే దేశంలో క్రమంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HMPV అంటే హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్...ఈ వైరస్ చిన్న పిల్లలకు సోకుతుంది. భారత్‌లోనూ ఈ కేసులు నమోదవుతున్నా ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో దీని ప్రమాదాన్ని తగ్గించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

HMPV Cases: వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులు గుర్తింపు.. ముంబైలో ఆరు నెల పాపకి పాజిటివ్..
Hmpv Virus
Follow us
Surya Kala

|

Updated on: Jan 08, 2025 | 3:29 PM

దేశంలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈరోజు (జనవరి 8) ముంబైలో మరో వైరస్ కేసు నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా పోవాయ్‌లోని హీరానందని హాస్పిటల్‌లో ఆరు నెలల పాప చికిత్స తీసుకుంటుంది. అయితే తాజాగా ఆ పాపకు కొత్త ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ చేయగా హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (హెచ్‌ఎంపీవీ)బారిన పడినట్లు గుర్తించారు. విపరీతమైన దగ్గు, ఛాతీలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయిలు 84 శాతానికి పడిపోవడంతో జనవరి 1న పాపను ఆస్పత్రిలో చేర్చారు. ఈ వైరస్‌కు నిర్దిష్ట చికిత్స లేనందున, శిశువుకు ఐసియులో బ్రోంకోడైలేటర్స్‌తో లక్షణాలతో చికిత్స అందించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఐదు రోజుల తర్వాత పాపను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

అయితే ఈ పాపకు సంబంధించి BMC హెల్త్ డిపార్ట్‌మెంట్ ఎటువంటి నివేదికను అందుకోలేదని చెప్పారు. అయితే ఎక్కువ మంది ఇన్ఫ్లుఎంజా తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతుండడంతో పర్యవేక్షణను పెంచామని పేర్కొంది.

తెలంగాణలో గత ఏడాదిలో ఈ కేసులు నమోదు

మరోవైపు తెలంగాణలో ఇప్పటికే ఈ హ్యూమన్‌ మెటాప్‌న్యూమోవైరస్‌ అడుగు పెట్టినట్లు మంగళవారం ఓ ప్రైవేట్‌ లేబొరేటరీ వెల్లడించింది. రాష్ట్రంలో హ్యూమన్‌ మెటాప్‌న్యూమోవైరస్‌ (హెచ్‌ఎంపీవీ) కేసులు నమోదు కాలేదన్న తెలంగాణ ప్రజారోగ్య శాఖ వాదనలకు భిన్నంగా గత నెలలో 11 మంది హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌ ఇన్‌ఫెక్షన్‌లను గుర్తించినట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లోని ప్రైవేట్ లేబొరేటరీ మణి మైక్రోబయోలాజికల్ లాబొరేటరీ వివిధ వైరల్ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్న రోగుల 258 శ్వాసకోశ శాంపిల్స్ ను పరీక్షలు నిర్వహించింది. ఈ 205 శాంపిల్స్ లో ఎక్కువగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 2024 డిసెంబర్‌ నెలకి సంబందించిన మణి మైక్రోబయాలజీ లాబొరేటరీకి చెందిన రెస్పిరేటరీ వైరల్ న్యుమోనియా ప్యానెల్ డేటా ప్రకారం పదకొండు శాంపిల్స్‌లో HMPV పాజిటివ్‌గా తేలింది. అంతేకాదు ఈ హెచ్‌ఎంపీవీకి పాజిటివ్‌గా తేలిన కేసులన్నీ కూడా కోలుకున్నాయి.

అయితే ఈ HMPV ఏదో కొత్త వైరస్ అని ప్రజలు భయపడవద్దు అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెప్పింది. చాలా కాలంగా భారతదేశంలో HMPV ఉందని స్పష్టం చేసింది. అంతేకాదు 2001 నుంచి ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఎంపీవీ ఉన్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీవాస్తవ ఉద్ఘాటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..