మన దేశంలో ఇదో వింత గ్రామం.. ఇక్కడ ఎవరికీ పేర్లు లేవు.. ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో తెలుసా..

సహజంగా మనిషిని మరొక మనిషి పేరుపెట్టి పిలుస్తారు. పేరు వ్యక్తికి ఒక ఐడెంటిటీని ఇస్తుంది. పిల్లలు పుట్టిన వెంటనే చిన్న, కన్న అంటూ రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తారు కూడా.. అయితే మన దేశంలో ఒక వింత గ్రామం ఉంది. ఈ గ్రామంలో నివసించే వారిలో ఎవరికీ సొంత పేరు లేదు. పేరు పెట్టి పిలవడానికి బదులుగా ఒక ప్రత్యేక పాట ద్వారా పిలుస్తారు. అయితే ఈ గ్రామం ఎక్కడ ఉంది? దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటి ఈ రోజు తెలుసుకుందాం..

మన దేశంలో ఇదో వింత గ్రామం.. ఇక్కడ ఎవరికీ పేర్లు లేవు..  ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో తెలుసా..
Whistling Village
Follow us
Surya Kala

|

Updated on: Jan 08, 2025 | 3:36 PM

మన భారతదేశంలో అసలు పేర్లంటూ లేని ప్రజలున్న గ్రామం ఒకటి ఉందని చెబితే ఆశ్చర్యపోతారు. ఈ గ్రామస్తులు ఒకరినొకరు పేర్లకు బదులుగా పాటలు పాడుతూ పిలుచుకుంటారు. అవును ఇది వాస్తవం. ఈ గ్రామంలో పిల్ల పుట్టిన వెంటనే అమ్మ ఒక రాగం వాయిస్తుంటుంది. ఆ రాగమే ఆ పిల్ల పేరు. మన దేశంలో ఈ ప్రత్యేకమైన గ్రామం మేఘాలయ రాష్ట్రంలో ఉంది. ఈ గ్రామం పేరు కొంగ్‌థాంగ్ గ్రామం. కొంగ్‌థాంగ్ గ్రామంలో ప్రజలు ఒకరినొకరు తమ పేర్లతో కాకుండా వేరే రాగం లేదా ప్రత్యేక రాగంతో పిలుచుకుంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని ‘విజిల్ విలేజ్’ అని కూడా పిలుస్తారు. కోంగ్‌థాంగ్ మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుండి 60 కి.మీ దూరంలో తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఉంది.

ఈ గ్రామ ప్రజలు తమ తోటి గ్రామస్తులకు తమ సందేశాన్ని తెలియజేయడానికి కూడా ఈలలు వేస్తారు. కొంగ్‌థాంగ్ గ్రామస్తులు ఈ ట్యూన్‌ని ‘జింగార్‌వై లవ్బీ’ అని పిలుస్తారు. అంటే తల్లి ప్రేమ గీతం. గ్రామస్తులకు రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి సాధారణ పేరు.. మరొకటి పాట పేరు. పాటల పేర్లకు రెండు వెర్షన్లు ఉన్నాయి.. పొడవైన పాట.. చిన్న పాట. సాధారణంగా చిన్న పాటలను ఇంట్లో.. పొడవైన పాటలను బయట వ్యక్తులు ఉపయోగిస్తారు.

700 విభిన్న రాగాలు

కొంగ్‌థాంగ్‌లో సుమారు 700 మంది గ్రామస్తులు ఉన్నారు.. పేరు ప్రకారం చూస్తే ఆ గ్రామంలో 700 విభిన్న రాగాలు ఉన్నాయి. ఫైవ్‌స్టార్ ఖోంగ్‌సిట్, ఖాసీ తెగకు చెందిన వారు కొంగ్‌థాంగ్ గ్రామంలో నివసిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన వ్యక్తులను పిలవడానికి ఉపయోగించే ‘ట్యూన్’ బిడ్డ పుట్టిన తర్వాత తల్లులు తయారు చేస్తారు. అయితే ఎవరైనా గ్రామస్థుడు మరణిస్తే .. అతనితో పాటు ఆ వ్యక్తి రాగం కూడా మరణిస్తుంది. ఈ గ్రామస్తులకు సొంత ట్యూన్లు ఉన్నాయి. పిల్లలు పుట్టిన వెంటనే అమ్మ ఈ రాగాలను సృష్టిస్తుంది.

ఇవి కూడా చదవండి

‘మా అమ్మ ట్యూన్ కంపోజ్ చేసింది’

మా ఊరిలో లేదా ఇంట్లో పిల్లల్ని పిలవాలంటే చిన్న రాగం వాడతారని గ్రామస్థుడు చెప్పాడు. తన పేరుని అమ్మ ట్యూన్ కంపోజ్ చేసిందని అదే పేరు జీవితాంతం కొనసాగుతుందని చెప్పారు. తరతరాలుగా తమ గ్రామంలో ఈ వ్యవస్థ కొనసాగుతోంది. అయితే ఎప్పుడు ఎలా మొదలైందో మాకు తెలియదని అంటున్నారు. తమ పేరుని ఇలా రాగంతో పిలవడం తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..