శివలింగానికి జలాభిషేకం ఎందుకు చేస్తారు? 7 రోజుల అభిషేకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా

పురాణాల ప్రకారం త్రిమూర్తులలో శివుడు అభిషేక ప్రియుడు. రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. అంటే శివో అభిషేక ప్రియ: అంటే శివుడు అభిషేక ప్రియుడు అని అర్ధం. లింగంపై హర హర మహాదేవ అంటూ జలంతో అభిషేకం చేస్తే చాలా భోలాశంకరుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని నమ్మకం. అభిషేక ప్రియుడైన పరమ శివుడికి జలాభిషేకం చేయడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక నమ్మకం ఏమిటంటే..

శివలింగానికి జలాభిషేకం ఎందుకు చేస్తారు? 7 రోజుల అభిషేకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా
Lord Shiva Puja
Follow us
Surya Kala

|

Updated on: Jan 06, 2025 | 8:41 PM

శివలింగం హిందూ మతంలో శివుడికి ప్రతీకగా భావించి పూజిస్తారు. శివలింగానికి నీరు పోసి అభిషేకం చేస్తారు. ఇలా చేయడం స్వచ్ఛత, భక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అలాగే భగవంతుడికి తన అహంకారాన్ని, కోరికలను లొంగదీసుకోవడం. అంటే నీటి స్వచ్ఛత ప్రకృతికి ప్రాణమిచ్చే శక్తిని సూచిస్తుంది. సాధారణంగా ఈ ఆచారాన్ని అభిషేకం అంటారు. ఇలా శివయ్యకు జలంతో అభిషేకం చేయడం వలన మానవులకు ఎదురయ్యే ప్రతికూల శక్తిని తొలగిస్తాడని ఆధ్యాత్మిక విశ్వాసం.

శివలింగానికి ఎలా అభిషేకం చేయాలంటే

  1. శివ లింగానికి దక్షిణం, తూర్పు వైపు నిల్చుని జల అభిషేకం చేయరాదు. శివలింగానికి ఉత్తర ముఖంగా అభిషేకం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
  2. ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసినప్పుడు కూర్చున్న స్థితిలోనే చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
  3. ఉక్కు లేదా ఇనుప పాత్రలతో శివలింగానికి అభిషేకం చేయరాదు. రాగి పాత్రలో నీరు తీసుకుని శివలింగానికి అభిషేకం చేయాలి.
  4. అయితే నీటితో కాకుండా పాలతో అభిషేకం చేస్తే ఈ నియమాలు వర్తించవు. సాధారణ పాత్రతో అయినా అభిషేకం చేయవచ్చు.
  5. ఇవి కూడా చదవండి
  6. శంఖంలో నీరు పోసి శివలింగానికి అభిషేకం చేయవద్దు. ఎందుకంటే శివుడు శంఖుడు అనే రాక్షసుడిని సంహరించడాని.. అప్పుడు శంఖం అతని ఎముకలతో తయారైందని పురాణాలు చెబుతున్నాయి.

శివుడికి ఏ వస్తువులతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం అంటే

  1. తేనె: తేనెతో అభిషేకం చేస్తే వ్యాధులు నయమవుతాయి.
  2. గంగాజలం: గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల వివిధ ప్రయోజనాలు లభిస్తాయి.
  3. చెరకు రసం: చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది. లాభాలు కలుగుతాయి.

అభిషేక చేయాల్సిన రోజు.. వాటి ప్రయోజనాలు

  1. ఆదివారం: శివునికి ఆదివారం అభిషేకం ప్రత్యేకం. ఆ రోజున అభిషేకం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.
  2. సోమవారం: శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోమవారం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున శివలింగానికి జలాభిషేకం చేస్తే అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి.
  3. మంగళవారం: ఈ రోజున శివునికి అభిషేకం చేస్తే దేవతల అనుగ్రహం లభిస్తుంది.
  4. బుధవారం: బుధవారం శివలింగానికి జలాభిషేకం చేస్తే వివాహ ఆటంకాలు తొలగిపోతాయి.
  5. గురువారం: ఈ రోజున అభిషేకం చేస్తే స్టూడెంట్స్ చదువులో మంచి విజయం లభిస్తుందని నమ్మకం.
  6. శుక్రవారం: శుక్రవారాల్లో శివలింగానికి నీటితో అభిషేకం చేస్తే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
  7. శనివారం : శనివారం రోజున శివునికి అభిషేకం చేస్తే అకాల మరణ భయం తొలగిపోయి దీర్ఘాయుస్సు లభిస్తుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.