Viral Video: జ్ఞానవాపి కేసు విచారణ.. కోర్టులోకి ప్రవేశించిన కోతి.. వీడియో వైరల్
వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి కేసుకు సంబంధించిన ముఖ్యమైన విచారణ జరుగుతుండగా.. అనుకోని విధంగా ఓ కోతి కోర్టు గదిలోకి ప్రవేశించిన ఆశ్చర్యకర ఘటన ఇక్కడ చోటుచేసుకుంది. సుమారు గంటసేపు కోర్టు టేబుల్‌పై కూర్చున్న కోతి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జ్ఞానవాపికి సంబంధించిన కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. అదేవిధంగా జనవరి 05వ తేదీ శనివారం వారణాసిలో జ్ఞానవాపి కేసు విచారణ జరుగుతుండగా ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టులో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. అవును ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన విచారణ జరుగుతున్నప్పుడు ఒక కోతి అనుకోకుండా కోర్టు గదిలోకి ప్రవేశించింది. సుమారు గంటసేపు కోర్టు టేబుల్‌పై కూర్చుని ఆపై అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఈ ఘటన కోర్టు సిబ్బందిని మాత్రమే కాదు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాశీ జ్ఞానవాపి కేసు విచారణ జనవరి 4న వారణాసి జిల్లా కోర్టులో జరిగింది. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. హిందువులు శుభసూచకంగా మాట్లాడుతున్నారు.
ఈ వీడియోను సచిన్ గుప్తా (SachinGuptaUP) తన X ఖాతాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి కేసు విచారణ జరుగుతుండగా.. అక్కడకు ఓ కోతి వచ్చి టేబుల్‌పై కూర్చుని ప్రొసీడింగ్‌లు వింటున్న ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది.
There has been a lot of discussion on social media and news channels about a monkey entering a #VaranasiCourt last week. It is being reported that the monkey entered the court-room during the #Gyanvapi case hearing (indicating divine intervention).
However, the truth is that… pic.twitter.com/Y948G1r2sk
— Sparsh Upadhyay (@ISparshUpadhyay) January 6, 2025
జనవరి 5న షేర్ చేసిన ఈ వీడియోకు 7,000 వ్యూస్ తో పాటు రకరకాల కామెంట్లు వచ్చాయి. ఒక వినియోగదారు ఈ కోతి దేవుని దూత కాగలదా? అని కామెంట్ చేయగా.. కోర్టులో భద్రత లేదు.. అందుకే కోతి కోర్టులోకి వచ్చిందని మరొకరు వ్యాఖ్యానించారు. అదే సమయంలో కోతి హనుమంతుడికి ప్రతి రూపం కనుక.. దైవ ఘటన అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..