- Telugu News Photo Gallery Black Coffee Side Effects: who should not drink black coffee these persons can be harmful
Black Coffee: బ్లాక్ కాఫీ మంచిదని తెగ తాగేస్తున్నారా.. ఈ ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త సుమా…
ఉదయమే కాఫీతో రోజుని మొదలు పెట్టేవారు చాలా మంది ఉన్నారు. కాఫీ ప్రియుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే పాలతో చేసిన కాఫీ మాత్రమే కాదు ఐస్ కాఫీ, బ్లాక్ కాఫీ వంటి రకరకాల కాఫీలను కూడా ఇష్టంగా తాగుతారు. బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే బ్లాక్ కాఫీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నా, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. బ్లాక్ కాఫీ ఏ వ్యక్తులకు హాని కలిగిస్తుందో ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Jan 06, 2025 | 6:58 PM

ఇలాంటి డయాబెటిస్ ఉన్నవారు బ్లాక్ కాఫీ తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. బ్లాక్ కాఫీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. బ్లాక్ కాఫీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.

కెఫిన్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది శరీరం, మెదడుపై బ్లాక్ కాఫీ ప్రభావం చూపుతుంది. మనుషుల శరీరం రకరకాలుగా ఉంటుంది. దీంతో బ్లాక్ కాఫీ కొందరికి ఇది శక్తినిస్తుంది. మరికొందరికి అనేక ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. బ్లాక్ కాఫీని ఏ వ్యక్తులు తాగకూడదో ఈ రోజు తెలుసుకుందాం..

కడుపు సమస్యలు ఉన్న వ్యక్తులు: బ్లాక్ కాఫీలో అధిక ఆమ్లత్వం ఉంటుంది. ఇది పొట్టలో ఆమ్లాన్ని పెంచుతుంది. దీని వల్ల ఎసిడిటీ, కడుపు మంట, గ్యాస్ , అల్సర్ వంటి సమస్యలు వస్తాయి. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) ఉన్నవారు దీనిని నివారించాలి.

ఈ బ్లాక్ కాఫీని పాలు, చక్కెర కలపకుండా తయారుచేసే ఒక సాధారణ కాఫీ. ఇది వేడి నీటిలో కాఫీ గింజలను మరిగించడం ద్వారా తయారుచేస్తారు. ఇది బలమైన, చేదు రుచిని కలిగి ఉంటుంది. బ్లాక్ కాఫీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది.

అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు: కెఫిన్ రక్తపోటును పెంచుతుంది. ఇప్పటికే బ్లాక్ ప్రెజర్ సమస్య ఉన్నవారికి దీని వినియోగం మరింత ప్రమాదకరం. అటువంటి పరిస్థితిలో అధిక రక్తపోటు ఉన్నవారు బ్లాక్ కాఫీని తాగకూడదు.

గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే స్త్రీలు: గర్భధారణ సమయంలో కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే కడుపులో బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది. అదనంగా ఇది పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అదే సమయంలో చనుబాలిస్తున్న సమయంలో.. బ్లాక్ కాఫీ పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే కెఫీన్ పాలు ద్వారా పిల్లలకి చేరుకుంటుంది.

ఇనుము, కాల్షియం లోపం ఉన్న వ్యక్తులు: బ్లాక్ కాఫీ ఐరన్, కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది. బలమైన ఎముకలకు కాల్షియం అవసరం. ఎక్కువ కాలం పాటు అధికంగా బ్లాక్ కాఫీని తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో ఇనుము, కాల్షియం లోపంతో బాధపడేవారు బ్లాక్ కాఫీని తాగవద్దు.




