- Telugu News Photo Gallery Cinema photos Muskan Nancy James files police complaint against her husband, sister in law Hansika Motwani and family
Hansika Motwani: హన్సిక పై గృహహింస కేసు.. పెట్టింది ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
దేశముదురు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక మోత్వాని. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. అంతకు ముందు బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఈ భామ. దేశముదురు సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది.
Updated on: Jan 06, 2025 | 6:47 PM

అందాల భామ హన్సిక ఊహించని చిక్కుల్లో పడింది, ఆమె పై గృహహింస కేసు నమోదైంది. హన్సిక సోదరుడు ప్రశాంత్ భార్య ముస్కాన్ పెట్టిన గృహ హింస కేసు చర్చనీయాంశంగా మారింది. హన్సికతో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తం మీద కేసు పెట్టింది ముస్కాన్.

హన్సిక సోదరుడు ప్రశాంత్, ముస్కాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరు 2021లో పెళ్లి పీటలు ఎక్కారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో ఈ ఇద్దరు రెండుళ్లుగా విడిగా ఉంటున్నారు. డిసెంబర్ 18న ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో గృహ హింస కేసు పెట్టింది.

తన అత్తా మామలతో పాటు తన భర్త ప్రశాంత్ సోదరి అయిన హీరోయిన్ హన్సికలు తమ వైవాహిక జీవితంలో జోక్యం చేస్తుకోవడంతో గొడవలు మొదలయ్యాయని. హన్సిక ఫ్యామిలీ మొత్తం మీద కేసు నమోదు చేసింది ముస్కాన్.

తనను తనను మానసికంగా, శారీరకంగా చాలా రోజులు హింసించారని తన ఫిర్యాదులో పేర్కొంది హన్సిక. ఇక దేశముదురు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది హన్సిక మోత్వాని. ఆతర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది. ఇక ఇప్పుడు టీవీ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఇటీవలే తమిళ్ లో లేడీ ఓరియేంటేడ్ సినిమాలు చేసింది. కానీ అంతగా సక్సెస్ సాధించలేకపోయింది హన్సిక.




