Telangana: ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం.. మూడు తరాలకు చెందిన మహిళలు ఒకేచోట చేరి సందడి..

సాధారణంగా పూర్వ విద్యార్థులు, కాలనీవాసులు, ప్రఖ్యాత సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులు ఆలుమిని పేరుతో ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకుంటారు. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో స్థిరపడిన వారు కూడా ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకుంటారు. సంస్థలు రాజకీయ పార్టీలు కూడా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తుంటాయి. అందరూ ఒకచోట చేరి ఆత్మీయంగా పలకరించుకొని తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు.

Telangana: ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం.. మూడు తరాలకు చెందిన మహిళలు ఒకేచోట చేరి సందడి..
Three Generations Women Get Together
Follow us
M Revan Reddy

| Edited By: Surya Kala

Updated on: Jan 06, 2025 | 5:18 PM

ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ , ఓల్డ్ స్టూడెంట్స్ కలవడం వంటి అనేక సమ్మేళనాలకు భిన్నంగా ఒక గ్రామానికి చెందిన ఆడబిడ్డలు ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం మీరు విన్నారా..? ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే.

యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం రాజన్నగూడెం గ్రామానికి చెందిన ఆడపడుచులు పెళ్లి చేసుకొని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈ గ్రామానికి చెందిన ఆడబిడ్డలు అందరికీ భిన్నంగా ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. వివాహాలు జరిగి వివిధ ప్రాంతాల్లోని అత్తవారిళ్లకు వెళ్లిన మూడు తరాల చెందిన ఆడబిడ్డలు ఒకచోట చేరి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఊరితో తమకు అనుబంధాన్ని, వివాహానికి ముందు ఉన్న తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబ వివరాలు చెప్పుకున్నారు.

ఈ సందర్భంగా చెంచా గోలి, సూది దారం, బెలూన్ బ్లాస్టింగ్, డంశార్డ్స్, అంత్యాక్షరి, మ్యూజికల్ చైర్, దాండియా తదితర ఆటలు ఆడారు. పాటలు పాడారు. ఎన్నో ఏళ్ల తర్వాత తొలిసారి కలుసుకున్న వారు భావోద్వేగానికి లోనయ్యారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపి వీడ్కోలు తీసుకుని తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి రాజన్న గూడెం గ్రామానికి చెందిన 56 మంది ఆడపడుచులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఇలాంటి ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం ఈ ప్రాంతంలో ఇదే తొలిసారి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..