AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు.. నా చావు ఆమెకు గుణపాఠం..

చట్టం ఎవరికీ చుట్టం కాదు అన్న సంగతి తెలిసిందే.. అయితే మహిళల రక్షణ కోసం చేసిన కొన్ని ప్రత్యేకమైన చట్టాలను కొంతమంది మహిళలు దుర్వినియోగం చేస్తున్న సంఘటలు గత కొంతకాలంగా విపరీతంగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా గృహహింస చట్టాన్ని సాకుగా తీసుకుని భర్తని, అత్తమామలను అకారణంగా హింసిస్తున్న భార్య బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా మరో భార్యా భాదితుడు బలి అయ్యాడు. తన ఆత్మ హత్యతో తన భార్యకు గుణపాఠం చెప్పాలంటూ ఓ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. ఈ దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Crime News: మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు.. నా చావు ఆమెకు గుణపాఠం..
Gujarath Man Sucide
Surya Kala
|

Updated on: Jan 06, 2025 | 5:05 PM

Share

గుజరాత్‌లో మరో భార్యాబాధితుడు బలి అయ్యాడు. తన భార్య పెడుతున్న వేధింపులను తట్టుకోలేక పోతున్నానని.. రాజీకి కూడా నిరాకరింస్తుందని ఆరోపిస్తూ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆత్మహత్యాయత్నం చట్టం కింద పోలీసులు విచారణ చేపట్టారు. తన భర్త ఆత్మహత్య చేసుకునే చేసిందనే ఆరోపణలపై గుజరాత్ పోలీసులు ఓ మహిళపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తన మరణానికి కారణమైన ఆమెకు గుణపాఠం చెప్పాలని తన కుటుంబాన్ని కోరుతూ వీడియోను రికార్డ్ చెసినట్లు.. ఆ వీడియో ఆధారంగా భార్యపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ 30వ తేదీన గుజరాత్‌లోని బొటాడ్ జిల్లాలో జామర్ధ వల్లగే నివాసి 39 ఏళ్ల సురేష్‌ భాయ్‌ సాథ్లియా తన ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని కనిపించాడు. భార్య మానసికంగా పెడుతున్న హింసను తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు.. కుటుంబ సభ్యులను కోరుతూ సెల్ ఫోన్ లో వీడియో చేశాడు. సత్తాదియా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వీడియో ఆధారంగా సతాదియా భార్య భార్య జయబెన్‌పై శుక్రవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

పెళ్లయినప్పటి నుంచి జయబెన్ సతాదియాను మానసికంగా వేధించేదని.. తన కోడలు తన కుమారుడితో తరచూ గొడవ పడుతూ తరచూగా తమ ఇంటి నుంచి వెళ్లి తల్లిదండ్రుల వద్ద ఉండేదని మృతుడి తండ్రి ఆరోపించాడు. జయబెన్‌ను ఇంటికి వచ్చేలా ఒప్పించేందుకు సతాదియా తన అత్తమామల ఇంటికి వెళ్లాడని.. అయితే ఇక తాను అత్తింటికి వచ్చేది లేదంటూ తెగేసి చెప్పిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దీంతో మనస్తాపానికి గురైన సురేష్‌ భాయ్‌ ఇంటికి వచ్చి వీడియో తీసి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించాడు. మృతుడి తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద భార్య జయపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..