Vastu Tips: పాత బట్టలను దానం చేయడానికి.. లేదా ఇంటిని శుభ్రం చేయడానికి.. నియమాలున్నాయని తెలుసా…
వాస్తు శాస్త్రం ప్రకారం పాత బట్టలు పారేయడం లేదా దానం చేయడం మంచిది కాదు. అయితే పాత బట్టలను ఇంట్లో నుంచి తీసివేయడం అనివార్యమైతే.. వాస్తు శాస్త్రంలో కొన్ని సూచనలు ఉన్నాయి. ఈ చిట్కాలను అనుసరించడం ముఖ్యం. అంతే కాదు ఇంటిని శుభ్రం చేయడానికి వాడేసిన పాత బట్టలు వాడటం మంచిది కాదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొత్త బట్టలు ఎక్కువ కాలం ధరించడంతో అవి పాతవి అవుతాయి. చిన్నపిల్లల కోసం కొన్న బట్టలు కూడా పిల్లలు పెద్దయ్యాక అవి వారికి చిన్నవుతాయి. అప్పుడు అలాంటి బట్టలు వేసుకోవడం కుదరదు. అలాంటి సమయాల్లో కొందరు పాత బట్టలను వీధిలో లేదా చెత్తకుప్పల్లో పడవేస్తారు. కొందరు తమ పాత బట్టలను వేరే వ్యక్తులకు ధరించడానికి ఇస్తారు. మరి కొంత మంది ఇంటిని శుభ్రం చేయడానికి పాత బట్టలు కూడా ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల పాత చీరలు లేక బట్టలు ఇచ్చి వాటితో డబ్బాలు, బకెట్లు కొంటారు. అయితే పాత బట్టలు పారేసే ఈ అలవాటు మంచిదేనా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందో తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం వాడేసిన లేదా పాత బట్టలు విసిరేయడం, అమ్మడం లేదా ఇతరులకు ఇవ్వడం వంటి అలవాటును వదిలివేయాలి. అయితే ఇంట్లో పాత బట్టలను భద్రపరచుకోవడానికి స్థలం లేక ఇబ్బంది పడుతుంటే.. వాస్తు శాస్త్రంలో కొన్ని సూచనలు ఉన్నాయి. ఈ చిట్కాలను అనుసరించడం ముఖ్యం.
ఎవరికైనా మీ పాత బట్టలు ఇవ్వాలని ఆలోచిస్తే.. ముందుగా వాటిని ఉప్పు నీటిలో నానబెట్టండి. బట్టలను మూడుసార్లు శుభ్రం చేసి దానం చేస్తే చాలా మంచిది. అలాగే ఉచితంగా బట్టలు ఎవరికీ ఇవ్వకండి. బట్టలు ఇచ్చిన తర్వాత వారి నుంచి కనీసం 1 రూపాయి అయినా తీసుకోండి. అలాగే బట్టలు ఎవరూ తీసుకెళ్లకపోతే డస్ట్‌బిన్‌లో వేయవద్దు.. వాటిని ప్రవహించే నది నీటిలోనే వదిలేయమని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికీ కొందరికి ఇల్లు శుభ్రం చేయడానికి పాత బట్టలు వాడే అలవాటు ఉంది. కొందరు వంటగదిలో లేదా నేల తుడుచుకోవడానికి పాత బట్టలను ఉపయోగిస్తారు. అయితే ఇలాంటి ఆచారం ఇంటికి మంచిది కాదని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.