Rajasthan: మరో చిన్నారిని మింగేసిన బోరు బావి.. 10 రోజులు మృత్యువుతో ప్రాణాల కోసం పోరాడి ఓడిన మూడేళ్ల బాలిక

బోరు బావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు.. చేపట్టిన సుదీర్ఘ ఆపరేషన్ విఫలం అయింది. దాదాపు 10 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి ఓటమిని అంగీకరించి భువి నుంచి దివికేగింది. అవును రాజస్థాన్‌లో బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి కథ విషాదంగా ముగిసింది. మృత్యువుతో ప్రాణాల కోసం పోరాడి ఓడిందా చిన్నారి.

Rajasthan: మరో చిన్నారిని మింగేసిన బోరు బావి.. 10 రోజులు మృత్యువుతో ప్రాణాల కోసం పోరాడి ఓడిన మూడేళ్ల బాలిక
Rajasthan Borewell Accident
Follow us
Surya Kala

|

Updated on: Jan 02, 2025 | 9:15 AM

మూడేళ్ల బాలికను కాపాడేందుకు సుదీర్ఘ ఆపరేషన్‌ చేపట్టిన అధికారులు.. 10 రోజుల తర్వాత ఎట్టకేలకు వెలికితీశారు. అనంతరం హుటాహుటిన చిన్నారిని అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించారు. అయితే తల్లితండ్రుల పూజలు, బంధువుల ఎదురుచూపులు, విపత్తు నిర్వహణ సిబ్బంది 10రోజుల కష్టం ఇవేవీ ఆ చిన్నారిని కాపాడలేకపోయాయి. చిన్నారి అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. కోఠ్‌పుత్లీ జిల్లాలోని కిరాట్‌పుర గ్రామానికి చెందిన మూడేళ్ల చేతన డిసెంబరు 23న తన తండ్రితో కలిసి పొలానికి వెళ్లింది. అక్కడ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయింది. దీంతో చేతనను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు.

బాలిక మొదట 15 అడుగుల లోతులోనే చిక్కుకుపోయింది. కుటుంబ సభ్యులు రక్షించేందుకు యత్నించగా మరింత కిందకు జారుకుంది. అలా 170 అడుగుల లోతులో పడిపోయిన చిన్నారిని హుకప్‌టెక్నిక్‌తో బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నించారు. అది విఫలం కాకపోవడంతో బోరుబావికి సమాంతరంగా సొరంగాన్ని తవ్వుతుండగా వారికి పెద్ద బండ రాయి అడ్డు తగిలింది.

దీంతో పాపను రక్షించేందుకు పైప్‌ల ద్వారా లోపలికి ఆక్సిజన్‌ పంపించడంతోపాటు.. కెమెరాల్లో బాలిక కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఆ కెమెరాలో బోరుబావిలో చేతన అటు ఇటు కదలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న దృశ్యాలు అందరిని కంటతడి పెట్టించాయి. చివరకు 10రోజుల తర్వాత చిన్నారని బయటకు తీసుకువచ్చారు. అయితే 170 అడుగుల లోతులో 10 రోజులు మృత్యువుతో పోరాడి ఓడింది. కళ్ల ముందు ఆడుకుంటూ తిరిగిన చిన్నారి.. ఇక లేదని తెలిసి.. ఆ తల్లిదండ్రుల హృదయం తల్లడిల్లింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..