2025 Prediction: 2025 ఏడాది గురించి 38 ఏళ్ల వ్యక్తి చెప్పిన భయంకర అంచనాలు.. నిజం అయితే మానవుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా..
ఇప్పటికే 2025 ఏడాది లో ఏమి జరగుతుందో తెలుసుకోవడానికి బాబా వెంగా ప్రొడక్షన్స్ పై దృష్టి సారించారు. అయితే తాజాగా సరికొత్త వ్యక్తీ కొత్త సంవత్సరం 2025లో ఏమి జరగనుంది అనే విషయాన్నీ అంచనా వేశారు. 2018లో ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని అంచనా వేసిన 38 ఏళ్ల వ్యక్తీ ఇప్పుడు కొత్త సంవత్సరం కోసం వేసిన అంచనాలు ఓ వైపు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మరోవైపు భయం గొలిపే విధంగా ఉన్నాయి.
ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరాన్ని స్వాగతించింది. వివిధ రకాలుగా సంబరాలను జరుపుకుంటూ న్యూ ఇయర్ కు వెల్కం చెప్పారు. అంతేకాదు కొత్త ఏడాదిలో తమ భవిష్యత్ ఎలా ఉంటుంది? ఏ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి.. అసలు ప్రపంచంలో ఎలాంటి స్థితి ఉంటుంది అని తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.
ది మిర్రర్‌లోని ఒక నివేదిక ప్రకారం లండన్‌కు చెందిన హిప్నోథెరపిస్ట్ నికోలస్ ఔజులా ప్రపంచం గురించి భయంకరమైన అంచనా వేశాడు. ఔజులా 2025లో జరగనున్న సంఘటనల గురించి మాట్లాడుతూ ఈ ఏడాదిలో మూడవ ప్రపంచ యుద్ధం జరగడం ఖాయమని చెప్పారు. ఇది కరుణ లేని సంవత్సరం అవుతుందన్నారు. మతం, జాతీయవాదం పేరుతో ప్రజలు ఒకరి గొంతులు ఒకరు కోసుకోవడం కనిపిస్తుందని.. రాజకీయ హత్యలు జరుగుతాయని చెప్పారు. చెడు, హింస భూమి మీద నివసిస్తున్న ప్రజలను చేరలోకి తీసుకుని వెళ్తాయని నికోలస్ చెప్పాడు.
కొత్త సంవత్సరం ప్రయోగశాలలో అవయవాలను ఉత్పత్తి చేస్తారని.. భారీ వర్షాలు కురిసి వినాశకరమైన వరదలు పోటెత్తుతాయని నికోలస్ ఔజులా అంచనా వేశారు. ఈ వరదలు లక్షలాది గృహాలను దెబ్బతీస్తాయని, లక్షలాది మంది నిరాశ్రయులవుతారని చెప్పారు. ఔజులా సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతాయని.. సముద్రంలో పెరిగే నీరు అనేక నగరాలను ముంచెత్తుతుందని అంచనా వేశారు.
రాజకీయ రంగం విషయంపై అంచనా వేసిన హిప్నోథెరపిస్ట్ నికోలస్ ఔజులా బ్రిటీష్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ రాజకీయ పతనం అవుతాడని పేర్కొన్నాడు. అంతేకాదు ప్రపంచంలో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతుందని ఊహించాడు. బ్రిటన్ యువరాజు విలియం,హ్యారీల మధ్య సయోధ్యను ఔజులా అంచనా వేశాడు. అయితే అతను కొత్త ఏడాది గురించి వేసిన అనేక భయంకరమైన అంచనాలలో ఏది నెరవేరుతుందో కాలమే చెబుతుంది.
నికోలస్ ఔజులా 17 సంవత్సరాల వయస్సులో తన కలలో ఒక వ్యక్తి కనిపించి తనకు భవిష్యత్తులో జరగనున్న సంఘటనలను గురించి వెల్లడించాడని చెప్పాడు. సో నికోలస్ భవిష్యత్ గురించి చేస్తోన్న అంచనాలన్నీ ఈ కల నుంచి ఉద్భవించినవే అని పేర్కొన్నాడు. విశేషమేమిటంటే బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమం, డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష విజయం, కృత్రిమ మేధస్సు పెరుగుదల, నోట్రే డామ్ కేథడ్రల్‌లో అగ్నిప్రమాదం, కోవిడ్ మహమ్మారి, రోబోట్ సైన్యాల అభివృద్ధి వంటి ముఖ్యమైన సంఘటనలను ఔజులా ఖచ్చితంగా ముందే చెప్పారు. ఈ రోజు వరకు అతను వేసిన అంచనాలు నిజమయ్యాయి.
నికోలస్ ఎప్పుడు వెలుగులోకి వచ్చాడు?
తనకు యుక్తవయసులో మానసిక సామర్థ్యాలు ఉన్నాయని గ్రహించినట్లు నికోలస్ పేర్కొన్నాడు. చాలా రోజుల పాటు కోమా తర్వాత.. తన గత జన్మలోని దర్శనాలనుచూడడం మొదలు పెట్టినట్లు పేర్కొన్నాడు. తను ఈజిప్టులో రాణిని అని చూశానని.. చైనాలో టైలర్‌గా పనిచేశానని చెప్పాడు. అంతేకాదు హిమాలయాల్లో సన్యాసినిగా కూడా గడిపినట్లు గత జన్మ గురించి చెప్పాడు. ఇక తాను ఆఫ్రికాలో జన్మించినప్పుడు తను మంత్రగత్తెగా జన్మించినట్లు.. అప్పుడు తను సింహంగా పుట్టినట్లు నికోలస్ చెప్పాడు. తనకు గత జన్మలో జరిగిన అనుభవాల ద్వారా ఇప్పుడు భవిష్యత్ ను అంచనా వేసే శక్తిని, విభిన్నమైన అనుభవాలు ఉన్నాయని పేర్కొన్నాడు. మరణం తధ్యం.. అయితే ఆ మరణం శారీరకంగానే కానీ ఆత్మ ఎప్పటికీ చావదు అని చెప్పాడు. ఇదే తన విషయంలో జరిగిందని.. మనం మళ్ళీ పుట్టినట్లు పేర్కొన్నాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..