AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thursday Puja: ఆర్ధిక ఇబ్బందులా.. గురువారం రోజున ఈ పరిహారాలు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం

వారంలో ఏడు రోజులు ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకి అంకితం చేయబడింది. గురువారం విష్ణువును, దేవతల గురువు బృహస్పతిని పూజించడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువుని ఆచారాల ప్రకారం పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల భక్తుల కోర్కెలు నెరవేరుతాయి. గురువారపు పూజకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం.

Thursday Puja: ఆర్ధిక ఇబ్బందులా.. గురువారం రోజున ఈ పరిహారాలు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం
Thursday Puja Tips
Surya Kala
|

Updated on: Jan 02, 2025 | 6:39 AM

Share

హిందూ మతంలో గురువారం విష్ణువు ఆరాధనకు అత్యంత ఫలవంతమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును పూజించిన భక్తులకు సుఖ సంతోషాలు, శ్రేయస్సు, దీవెనలు లభిస్తాయని నమ్మకం. గురువారం రోజున వ్రతం చేయడం వలన సాధకునికి కష్టాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి ఇబ్బంది పడుతున్న వారు లేదా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తమ పురోగతిలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు గురువారం విష్ణువు, బృహస్పతి ఇద్దరినీ పూజించాలి. నారాయణుని ఆరాధించడం ద్వారా లక్ష్మీదేవి కూడా ప్రసన్నురాలవుతుందని.. ఆర్ధిక ప్రయోజనం పొందుతారని నమ్ముతారు. గురువారం రోజున విష్ణువుని ఆరాధించేందుకు కొన్ని ఖచ్చితమైన మార్గాలు ఉన్నాయి. వాటి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

  1. తులసికి మహా విష్ణువుకు చాలా ప్రీతికరమైనదని నమ్ముతారు. అందువల్ల గురువారం తులసి పూజకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. తులసి లేకుండా శ్రీ హరి ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుందని నమ్ముతారు. అందుకే గురువారం నాడు శ్రీ మహా విష్ణువును పూజించేటప్పుడు ఖచ్చితంగా తులసిదళాలను విష్ణువుకి సమర్పించండి.
  2. ఏ దేవతను పూజించినా మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి పరిస్థితిలో విష్ణువు అనుగ్రహం పొందడానికి గురువారం రోజున జపమాలతో తులసిని జపించండి. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అనే మంత్రాన్ని జపించండి. దీనివల్ల భగవంతుడు త్వరగా సంతోషిస్తాడని నమ్ముతారు.
  3. ఎవరికైనా వివాహంలో పదేపదే అడ్డంకులు ఎదురవుతున్నట్లయితే, లేదా బంధం ఖరారు అయిన తర్వాత విచ్ఛిన్నమైతే ఖచ్చితంగా గురువారం రోజున శ్రీ మహా విష్ణువును పూజించండి. ఈ రోజు కూడా ఉపవాసం ఉండండి. ఈ రోజున విష్ణువు ఆలయానికి వెళ్లి పసుపు పువ్వులు , పసుపు మిఠాయిలను సమర్పించండి. దీనివల్ల భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం.
  4. గురువారం రోజున రావి చెట్టు, అరటి చెట్టు, తులసిని పూజించడం వల్ల విష్ణువు, లక్ష్మిదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇలా చేయడం వల్ల సాధకుడికి ఆర్థిక సమస్యలు ఎదురుకావు.
  5. ఇవి కూడా చదవండి
  6. వీలైతే గురువారం పసుపు రంగు దుస్తులు ధరించండి. ఇది మాత్రమే కాదు పూజ చేసేటప్పుడు ఆసనంపై పసుపు వస్త్రం వేసుకుని మాత్రమే కూర్చోండి. ఈ పరిహారాన్ని చేయడం ద్వారా భక్తుడి జీవితంలో ఎన్నటికీ ఏ విషయంలోనూ కొరత ఉండదని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
ఆకాశమే హద్దుగా వెండి పరుగులు.. నెల రోజుల్లో ధర ఎంత..
ఆకాశమే హద్దుగా వెండి పరుగులు.. నెల రోజుల్లో ధర ఎంత..
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?
నాలుకపై మచ్చలు ఉంటే ఏం మాట్లాడినా నిజం అవుతాయా?
నాలుకపై మచ్చలు ఉంటే ఏం మాట్లాడినా నిజం అవుతాయా?