Maha Kumbha Mela: మహా కుంభ్‌లో ఆర్మీ సిబ్బంది, రిటైర్డ్ సైనికుల కోసం ప్రత్యేక టెంట్స్ .. ఆన్‌లైన్ బుకింగ్ మొదలు

మహా కుంభ మేళా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ ఏడాది ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహా కుంభ మేళా కోసం ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు, సాధువులు ఈ మేళాకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మహా కుంభ లో పాల్గొనే ఆర్మీ సిబ్బంది, రిటైర్డ్ సైనికుల కోసం ప్రత్యేక టెంట్ కాలనీ నిర్మింస్తున్నారు. ఇక్కడ బస చేయాలనుకునే ఆర్మీ సిబ్బంది, మాజీ ఆర్మీ అధికారులు ఆన్‌లైన్ లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది

Maha Kumbha Mela: మహా కుంభ్‌లో ఆర్మీ సిబ్బంది, రిటైర్డ్ సైనికుల కోసం ప్రత్యేక టెంట్స్ .. ఆన్‌లైన్ బుకింగ్ మొదలు
Maha Kumbha Mela 2025
Follow us
Surya Kala

|

Updated on: Jan 02, 2025 | 8:59 AM

మహా కుంభమేళా జనవరి 13, 2025 సోమవారం పుష్య మాసం పూర్ణిమ రోజున ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ మహా కుంభ మేళాలో పాల్గొనేందుకు అఖారాలు, కల్పవాసులు రావడం ప్రారంభించారు. మహా కుంభానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి మహాకుంభలో పాల్గొనలానుకునే దేశవ్యాప్తంగా ఉన్న సైనికులు, మాజీ సైనికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహాకుంభ సందర్భంగా త్రివేణీ సంగమంలో స్నానం చేసే సైనికులు, మాజీ సైనికులు బస చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సైనికులు, మాజీ సైనికుల బస కోసం జాతర ప్రాంతంలో టెంట్లు వేస్తున్నారు.

మహాకుంభంలో సంగమ స్నానం చేయడానికి దేశంలోని ఏ మూల నుంచి అయినా సైనికులు, మాజీ సైనికులు పాల్గొనవచ్చు అని అంచనా వేస్తున్నారు. అందుకనే ఈ స్పెషల్ ఏర్పాట్లు వేస్తున్నారు. అయితే టెంట్‌లో ఉండేందుకు సైనికులు, మాజీ సైనికులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మహాకుంభానికి వచ్చే సైనికులు, మాజీ సైనికులకు సంగం, కోట లోపల బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంగంలో టెంట్ కాలనీ, కోటలో గెస్ట్ హౌస్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మహా కుంభమేళాలో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి

ఈ విషయాన్నీ ఆర్మీ ‘సూర్య కమాండ్’ ట్వీట్ చేసింది. మహాకుంభ్‌లో ఆర్మీ సైనికులు, రిటైర్డ్ సైనికులకు బస కోసం ప్రత్యేక ఏర్పాట్లు సెంట్రల్ కమాండ్, తూర్పు ఉత్తర ప్రదేశ్ సబ్ రీజియన్, సెంట్రల్ ఇండియా రీజియన్ ప్రధాన కార్యాలయం ద్వారా చేయబడుతున్నాయని పేర్కొన్నాడు. మహా కుంభమేళాకు భారత సాయుధ దళాలకు చెందిన సైనికులు, రిటైర్డ్ సైనికులు ఇక్కడకు చేరుకోనున్నారు.

సూర్య కమాన్ ట్వీట్‌లో ఇంకా మాట్లాడుతూ.. “సైనికులు, రిటైర్డ్ సైనికులు ఆన్‌లైన్ లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉంటుందని వెల్లడించారు. మహా కుంభం దృష్ట్యా కోటలో హెల్ప్ డెస్క్, వైద్య సదుపాయాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోటలో మరమ్మతు పనులు కూడా ముగింపు దశకు వస్తున్నాయి. ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమైంది. బుకింగ్ చేసుకోవాలనుకునే వారి కోసం సూర్య కమాన్ తన ట్వీట్‌లో లింక్‌ను కూడా ఇచ్చారు. ఈ లింక్ ద్వారా ఆర్మీ సిబ్బంది, రిటైర్డ్ సైనికులు బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు.

మహాకుంభ్‌లో సైన్యాన్ని కూడా మోహరించారు

భారత సైన్యం తన అసమానమైన ధైర్యసాహసాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. శత్రు దేశపు కుతంత్రాలను తిప్పికొట్టేందుకు భారత ఆర్మీ సైనికులు పగలనక రాత్రంతా దేశ భద్రతలో నిమగ్నమై ఉన్నారు. దేశ భద్రతతో పాటు ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా ఆపద ఉన్నా మేము సిద్ధంగా ఉన్నాం అంటూ ముందుకొస్తారు. దేశంలో ఏ ప్రకృతి విపత్తు సంభవించినా సహాయక చర్యలు లేదా అంతర్జాతీయ కార్యక్రమం అయినా మన సైన్యం ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మహాకుంభ్‌లో సైన్యాన్ని కూడా మోహరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..