Astro Tips: నవ గ్రహ దోషాలా.. కొత్త ఏడాదిలో గ్రహాల ఆశీస్సులు పొందలనుకుంటే ఈ నివారణ చర్యలు చేసి చూడండి..

ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం 2025లో నైనా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. తాము సుఖ సంతోషాలతో జీవించాలంటే నవగ్రహాల అనుగ్రహం ఉండాలి. నవ గ్రహాల ఆశీర్వాదం పొందాలనుకునేవారు కొన్ని సులభమైన చర్యలు తీసుకోవాలి. ఈ నివారణ చర్యలను పాటించడం వలన గ్రహాల ఆశీర్వాదాన్ని పొందుతారు. నవ గ్రహాల అనుగ్రహం లభించిన వారి జీవితం ఏడాది పొడవునా సంతోషంగా జీవిస్తారు. ఈ రోజు నవ గ్రహాలు శాంతించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం?

Astro Tips: నవ గ్రహ దోషాలా.. కొత్త ఏడాదిలో గ్రహాల ఆశీస్సులు పొందలనుకుంటే ఈ నివారణ చర్యలు చేసి చూడండి..
Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: Jan 02, 2025 | 9:57 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కుజుడు, గురు, శుక్రుడు, శని, రాహువు, కేతువు అనే మొత్తం 9 గ్రహాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి ఒక్కరి జాతకంలో ఈ 9 గ్రహాలు, 12 రాశులు ఉంటాయి. ఈ నవ గ్రహాల్లోని ప్రతి ఒక్క రాశి 12 రాశులలోనికి ఏదో ఒక సమయంలో అడుగు పెడుతుంది. దీని పరిణామాలు ఆ రాశి ప్రజల జీవితాలపై పడతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైనా తెలిసి తెలియక చేసే పొరపాట్లతో నవగ్రహాల అనుగ్రహం దక్కదు. జాతకంలో గ్రహ దోషాలు ఏర్పడతాయి. అప్పుడు ఆ వ్యక్తులు ఆర్థిక సంక్షోభం, వృత్తిలో ఇబ్బందులు, ఆర్ధికంగా పురోగతి లేకపోవడం, కుటుంబంలో తగాదాలు, ఆరోగ్యం క్షీణించడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో నవ గ్రహాలను శాంతింపజేసేందుకు చర్యలు తీసుకోవడం అవసరం.

జ్యోతిషశాస్త్రంలో తొమ్మిది గ్రహాల శాంతి కోసం అనేక నివారణలు సూచించబడ్డాయి. వీటిల్లో కొన్ని సులభంగా చేయగల చర్యలు కొన్ని సూచించబడ్డాయి. కొత్త సంవత్సరంలో తొమ్మిది గ్రహాలను ప్రసన్నం చేసుకుని.. వారి ఆశీస్సులు పొందాలంటే.. తొమ్మిది గ్రహాలు శాంతించాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం..

నవ గ్రహాలను ఎలా ప్రసన్నం చేసుకోవాలంటే

  1. సూర్య దోషం – జాతకంలో సూర్యుడి చెడు స్థితిని సరిచేయడానికి రాత్రి నిద్ర పోయే ముందు మంచం క్రింద నీటితో నింపిన రాగి పాత్రను ఉంచండి. రాత్రి పడుకునే ముందు ఎర్రచందనం దిండు కింద గుడ్డలో కట్టి పెట్టుకోవాలి.
  2. చంద్ర దోషం – జాతకంలో చంద్రుని స్థానం చెడుగా ఉంటే.. మంచం క్రింద నీటితో నింపిన వెండి పాత్రను ఉంచండి. అలాగే పడుకునేటప్పుడు వెండి ఆభరణాలను దిండు కింద పెట్టుకోవడం వల్ల మేలు జరుగుతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. మంగళ దోషం – ఎవరి జాతకంలోనైనా మంగళ దోషం ఉన్నట్లయితే జాతకంలోని మంగళ దోషాన్ని తొలగించడానికి మంచం కింద నీటితో నిండిన కాంస్య పాత్రను ఉంచాలి. అంతేకాదు దిండు కింద బంగారం లేదా వెండితో చేసిన కొన్ని ఆభరణాలను ఉంచండి.
  5. బుధ దోషం – జాతకంలో బుధుని స్థానం బలహీనంగా ఉన్నట్లయితే లేదా బుధ దోషం ఉన్నట్లయితే.. రాత్రి సమయంలో దిండు కింద బంగారు ఆభరణాలను ఉంచండి. ఇలా చేయడం వల్ల బుధ దోషం తొలగిపోతుంది.
  6. గురు దోషం – జాతకచక్రం నుంచి గురు దోషం తొలగి పోవడానికి పసుపు ముద్దను శుభ్రమైన గుడ్డలో కట్టి దిండు కింద పెట్టుకుని నిద్రించండి. ఇలా చేయడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది.
  7. రాహు దోషం – జాతకం నుంచి రాహువు స్థానాన్ని సరిచేయడానికి ప్రతిరోజూ నుదుటిపై తిలకం దిద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల రాహు దోషం నుంచి ప్రయోజనం పొందుతారు.
  8. కేతు దోషం – ఎవరి జాతకంలో నైనా కేతు దోషాన్ని తొలగించుకోవాలనుకుంటే.. రెండు రంగుల కుక్కకు ఆహారాన్ని అందించండి. వీలైతే ఇంట్లో కుక్కను పెంచుకోండి.
  9. శుక్రగ్రహ దోషం – శుక్రుడు ఐశ్వర్యానికి చిహ్నంగా భావిస్తారు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే వెండి చేపను తయారు చేసి దిండు కింద ఉంచి నిద్రించండి. అంతే కాదు వెండి పాత్రలో నీటిని నింపి మంచం కింద ఉంచాలి.
  10. శని దోషం – జాతకంలో శని దోషం ఉంటే ప్రతిరోజూ శనీశ్వరుడిని పూజించండి. అంతేకాదు శనీశ్వరుడికి ఇష్టమైన రత్నం నీలాన్ని దిండు కింద పెట్టుకుని నిద్రించండి. అలాగే ఒక ఇనుప పాత్రలో నీటితో నింపి మంచం క్రింద ఉంచుకోవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.