Horoscope Today: వారికి ఇంటా బయటా కొన్ని అనుకూలతలు.. 12రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (జనవరి 2, 2025): మేష రాశి వారికి కొందరు మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఆశించిన ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Today Horoscope (జనవరి 2, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొందరు మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. మిథున రాశి వారికి ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం కలుగుతుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. కొందరు మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులతో విహార యాత్ర తలపెడతారు. రావలసిన డబ్బును పట్టుదలగా వసూలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఆశించిన ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో సొంత నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యు లతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఆశిం చిన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవే శపెడతారు. వృత్తి జీవితం కొద్దిగా బిజీ అయిపోతుంది. కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. చేప ట్టిన పనులు సవ్యంగా పూర్తవుతాయి. సోదరులతో విభేదాలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. బాధ్యతలు, లక్ష్యాలతో ఇబ్బంది పడతారు. ఆదా యంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. చాలా కాలంగా పెండిం గులో ఉన్న ముఖ్యమైన వ్యవహారాలను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాల్లో ఒకటి రెండు మార్పులు చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. కొద్దిగా శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసు కోవద్దు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇంటా బయటా కొన్ని అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యవహా రాల్లో జీవిత భాగస్వామి సలహాలు బాగా ఉపయోగపడతాయి. మిత్రుల కారణంగా కొద్దిగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి సమయం మరింత అనుకూలంగా ఉంది. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తిక రంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల మానసిక, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసు కోకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో కూడా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మిత్రులకు అండగా నిలబడతారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అధికారులు ఎంతో నమ్మకంతో ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి రంగంలో ఉన్న వారికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగు లకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఒకరి ద్దరు బంధువులతో అపార్థాలు చాలావరకు పరిష్కారమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ది చెందుతుంది. కొందరు ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. సన్నిహితుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో అనుకూల పరిస్థితులుంటాయి. ప్రతి విషయంలోనూ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఉంటాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందు తుంది. ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో మీ పని తీరుతో అధికారులను. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగు తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచ యాలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. జీతభత్యాలు బాగా పెరిగే సూచనలున్నాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి జీవి తంలో ఉన్నవారికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త ఆదాయ ప్రయత్నాలు చేపడతారు. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపో తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.