Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
Today Horoscope (January 3, 2025): మేష రాశి వారికి ఆదాయ వృద్ధికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా కలిసి వచ్చే అవకాశముంది. ఎవరినీ అతిగా నమ్మవద్దు. వృషభ రాశి వారికి ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాద్యతలు మారిపోతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (జనవరి 3, 2025): మేష రాశి వారికి ఆదాయ వృద్ధికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా కలిసి వచ్చే అవకాశముంది. వృషభ రాశి వారికి ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాద్యతలు మారిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి కలుగుతుంది. అధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబ జీవితంలో సొంత ఆలోచనల వల్ల ఫలితం ఉంటుంది. ఊహించని పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఆదాయ వృద్ధికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఎవరినీ అతిగా నమ్మవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ వృద్ధికి ఆటంకాలు కలుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగి పోతాయి. ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయం బాగా పెరగడం వల్ల కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి, రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా, సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితిలో ఉంటారు. ఉద్యోగంలో బాద్యతలు మారిపోతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. కొద్ది శ్రమతో ముఖ్య మైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయపడతారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ముఖ్యమైన వ్యవహారాలన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. మానసికంగా ఊరట కలగడంతో పాటు ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మిత్రుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలుప రిష్కారమవుతాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు బాగా తగ్గుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయ వ్యయాలు సమానంగా సాగిపోతాయి. ఆర్థికపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభ సాటిగా పురోగమిస్తాయి. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ అనుకూల ఫలితాలనిస్తాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడంతో పాటు ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా సాగిపోతుంది కానీ, అనుకోని ఖర్చులు తప్ప కపోవచ్చు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా పురోగతి సాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు సజావుగా పూర్త వుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలను, కొన్ని లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వ్యయ ప్రయాసలున్నా ప్రతి పనినీ పూర్తి చేసి ఊరట చెందుతారు. ఇంటా బయటా అనుకూలత లకు లోటుండదు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొందరు ప్రముఖులతో ఊహించని పరిచ యాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సమాజ సేవా కార్య క్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ప్రాధా న్యం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
పదోన్నతి, జీతభత్యాలకు సంబంధించి ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అదనపు బాధ్య తల నుంచి ఉపశమనం లభిస్తుంది.లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవ హారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీ అయిపోతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి లోటుండదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆదాయం నిలకడగా సాగిపోతుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రస్తుతానికి ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. చేపట్టిన వ్యవహారాలన్నీ సకాలంలో పూర్త వుతాయి. వ్యాపారాల్లో శ్రమకు, పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. దైవ దర్శనాలు చేసు కుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అను కూలంగా ముందుకు సాగుతాయి. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. కొందరు బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు ఉండవచ్చు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల పరిష్కారంలో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. సర్వత్రా గౌరవమర్యా దలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.