Women Astrology: మహిళలపై శుక్రుడు కనక వర్షం.. ఆ రాశుల వారికి అపార ధన లాభాలు
Shukra Gochar 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడికి మహిళా పక్షపాతిగా పేరుంది. సుఖ సంతోషాలకు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు ప్రస్తుతం కుంభ రాశిలో సంచారం చేస్తున్నాడు. దీని వల్ల మహిళలకు వృత్తి, ఉద్యోగాలపరంగా చేయూతనందించే అవకాశం ఉంది. జనవరి 28 తర్వాత మీన రాశిలో ప్రవేశించనున్న శుక్రుడు ఉచ్ఛపట్టడం, అదే రాశిలో ఏప్రిల్ మొదటి వారం వరకూ కొనసాగడం వల్ల నాలుగు నెలల పాటు కొన్ని రాశులకు చెందిన మహిళలకు జీవితం అన్ని విధాలా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వారి మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి.
శుక్రుడికి మహిళా పక్షపాతిగా పేరుంది. సుఖ సంతోషాలకు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు ప్రస్తుతం కుంభ రాశిలో సంచారం చేస్తుండడం వల్ల మహిళలకు వృత్తి, ఉద్యోగాలపరంగా చేయూతనందించే అవకాశం ఉంది. జనవరి 28 తర్వాత మీన రాశిలో ప్రవేశించి ఉచ్ఛపట్టడం, అదే రాశిలో ఏప్రిల్ మొదటి వారం వరకూ కొనసాగడం వల్ల నాలుగు నెలల పాటు కొన్ని రాశుల మహిళలకు జీవితం అన్ని విధాలా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వారి మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభ రాశులకు చెందిన మహిళలు తమకు సంబంధించిన రంగాల్లో విశేష పురోగతి సాధిస్తారు. గృహ సేవకే పరిమితమైన మహిళలకు సైతం అపార ధన లాభాలు కలిగే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి దశమ, లాభ స్థానాల్లో రాశ్యధిపతి శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు పదోన్నతులు లభించడం, జీతభత్యాలు పెరగడం వంటివి తప్పకుండా కలుగు తాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశీయానానికి కూడా అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొద్ది శ్రమతో సంపన్నులయ్యే అవకాశం ఉంది. పిల్లలు విజయాలు సాధిస్తారు.
- మిథునం: ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో శుక్ర సంచారం జరుగుతున్నందువల్ల ఈ రాశికి చెందిన మహిళ లకు వృత్తి, ఉద్యోగంలో ఊహించని పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. చదువుల్లో ఉన్న మహిళలు ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడమో, పెళ్లి కావడమో జరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- కన్య: ఈ రాశికి ధన, భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన శుక్రుడు మిత్ర, ఉచ్ఛ క్షేత్రాల్లో సంచారం చేస్తు న్నందువల్ల గృహిణులుగా ఉన్న మహిళలు సైతం అధిక ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపార ధన లాభం కలుగుతుంది. మనసులోని కొన్ని కోరికలు, ఆశలు తప్పకుండా నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న మహిళలు శీఘ్ర పురోగతి సాధించడానికి, అందలాలు ఎక్కడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది.
- తుల: రాశ్యధిపతి శుక్రుడు మిత్ర క్షేత్రంలోనూ, ఆ తర్వాత ఉచ్ఛ క్షేత్రంలోనూ సంచారం చేయడం వల్ల ఈ రాశి మహిళలకు అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. తల్లితండ్రుల నుంచి ఆస్తి లభించే అవకాశం ఉంది. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి ఖాయమయ్యే అవకాశం ఉంది. ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లడం జరుగుతుంది. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ధన స్థానంలో ధనాధిపతితో సంచరించడం, ఆ తర్వాత మూడు నెలల పాటు ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశికి చెందిన మహిళలు ఉన్నత పదవులను చేపట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అనేక సానుకూల పరిణామాలు, శుభ యోగాలు చోటు చేసు కుంటాయి. సాధారణ గృహిణులు సైతం సంపన్నులయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితోఅన్యోన్యత పెరుగుతుంది.
- కుంభం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ఈ రాశిలోనూ, ఉచ్ఛ క్షేత్రమైన ధన స్థానంలోనూ సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ధనపరంగా అంచనాలకు మించిన అభివృద్ధి ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు దాదాపు కనక వర్షం కురిపిస్తాయి. పిత్రార్జితం లభి స్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగం కలుగుతుంది.